BigTV English

Jani Master: తెలుగు వదిలేసి అక్కడకు మకాం మార్చిన జానీ మాస్టర్.. ఆ స్టార్ హీరో బ్లెస్సింగ్స్ తో..

Jani Master: తెలుగు వదిలేసి అక్కడకు మకాం మార్చిన జానీ మాస్టర్.. ఆ స్టార్ హీరో బ్లెస్సింగ్స్ తో..

Jani Master: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్  గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఒక చిన్న డ్యాన్స్ కంటెస్టెంట్ గా కెరీర్ ను ప్రారంభించి.. తన  ప్రతిభతో స్టార్ హీరోల సినిమాలలో ఛాన్స్ లు అందుకొని.. మంచి మంచి స్టెప్స్ తో  ప్రేక్షకులను అలరించి  స్టార్ కొరియోగ్రాఫర్ గా మారాడు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ  భాషల్లో కూడా తన సత్తా చూపించాడు. తన డ్యాన్స్ తో అందరిని మెప్పించడమే కాకుండా ఎన్నో అవార్డులను కైవసం చేసుకున్నాడు.


ఇక ధనుష్ నటించిన తిరు సినిమాకు గాను.. జానీ మాస్టర్ కు జాతీయ అవార్డు కూడా లభించింది. అన్ని మంచిగా జరిగి ఉంటే.. ఆ అవార్డును జానీ మాస్టర్ అందుకొనేవాడు. కానీ, అలా జరగలేదు. లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యాడు. తన దగ్గర పనిచేసే  లేడీ డ్యాన్సర్.. తనను జానీ మాస్టర్ వేధింపులకు గురిచేస్తున్నాడు అని పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇండస్ట్రీలో పెనుసంచలనాన్ని రేకెత్తించింది.

జానీ మాస్టర్ తనను పెళ్లి చేసుకోమని బలవంతపెడుతున్నాడని, తన భార్య మతం మార్చుకోమని బెదిరిస్తుందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే పోలీసులు జానీ మాస్టర్ ను అరెస్ట్ చేశారు. ఇక జానీ మాస్టర్ సైతం తన తప్పును ఒప్పుకొని జైలుకు వెళ్ళాడు. రెండుసార్లు  జానీ మాస్టర్ కు బెయిల్ రిజెక్ట్ అవ్వగా.. మూడోసారి ఆయనకు బెయిల్ మంజూరు అయ్యింది. ప్రస్తుతం బెయిల్ మీదనే జానీ మాస్టర్ బయటకు వచ్చాడు.


Thandel Trailer: దూళ్లకొట్టేసిన తండేల్ రాజు.. చై నట విశ్వరూపమే

జానీ మాస్టర్ బయటకు వచ్చాకా.. ఆ ఘటననే తలుచుకొని ఇంట్లో కుంగిపోలేదు. తాను తప్పు చేసానని.. సిగ్గుతో బయటకు రాకుండా కూర్చోలేదు. జైలు నుంచి బయటకు రాగానే.. సోషల్ మీడియాలో తాను కొరియోగ్రఫీ చేసిన సాంగ్  గురించి  మాట్లాడుతూ.. ఆ సాంగ్ ను పెద్ద హిట్ చేసినందుకు అభిమానులకు థాంక్స్ చెప్పాడు. ఆ తరువాత కుటుంబంతో సమయాన్ని గడిపాడు. వరుస ఇంటర్వ్యూలు ఇచ్చాడు.

ఇక తాజాగా జానీ మాస్టర్ కొత్త జర్నీ మొదలుపెట్టాడు. తెలుగులో అవకాశాల కోసం తిరగకుండా.. వేరే ఇండస్ట్రీలో తనను వెతుక్కుంటూ వచ్చిన అవకాశాలను ఒడిసిపట్టుకున్నాడు. ప్రస్తుతం జానీ మాస్టర్ బెంగుళూరులో  కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక బెంగుళూరు వెళ్ళగానే.. దివంగత నటులు రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ సమాధుల వద్దకు వెళ్లి.. వారి బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. “బెంగుళూరులో నా తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రారంభించే ముందు డాక్టర్  రాజ్‌కుమార్ మెమోరియల్‌లో లెజెండరీ రాజ్‌కుమార్‌ గారు, పార్వతమ్మ గారు,పునీత్ రాజ్‌కుమార్ సర్ కు నివాళులర్పించి, వారి ఆశీస్సులు అందుకున్నాను” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

పునీత్ రాజ్ కుమార్ నటించిన యువరత్న సినిమాలోని ఫీల్ ది పవర్ అనే సాంగ్ కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. ఈ సాంగ్ కు జానీ మాస్టర్ కు బెస్ట్ కొరియోగ్రఫీ కేటగిరిలో ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. పునీత్ కు, జానీకి మధ్య స్నేహ బంధం ఉండేదని జానీ చెప్పుకొచ్చాడు. అందుకే ఇప్పుడు కన్నడలో రీఎంట్రీ ఇవ్వడంతో ఆయన బ్లెస్సింగ్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. మరి అక్కడ జానీ మాస్టర్ ఎలాంటి గుర్తింపును అందుకుంటాడో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×