Big Stories

Female Hanuman Temple:- మహిళా రూపంలో ఆంజనేయుడి పూజలందుకునే ఆలయం…

- Advertisement -

Female Hanuman Temple:- శ్రీరామదూత ఆంజనేయుడు శక్తిసంపన్నుడు. దేశంలో ఆంజయనేయుడికి ఎన్నో విశిష్ట ఆలయాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా ఆంజనేయుడు రూపం దాదాపు ఒకవేవిధంగానే ఉంటాయి. ధ్యానం చేస్తూ, ఆభయ ఆంజనేయుడి రూపం ఇవన్నీ కనిపిస్తాయి. కానీ దేవతా రూపంలో కూడా హనుమంతుడు పూజలందుకుంటున్న ఒక్కే ఒక ఆలయం మనదేశంలోనే ఉంది. తెలంగాణ పక్కన ఉన్న ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో గిర్జ్ బంద్ లో ఈ ఆలయం ఉంది. రతన్ పూర్ జిల్లాలోని గుడి శ్రీ హనుమంతుడు దేవతా మూర్తి దర్శనం భిన్నంగా ఉంటుంది.

- Advertisement -

మరణం లేని హనుమంతుడ్ని దేవతారూపంలో భక్తితో ఇక్కడ భక్తులు అపారమైన నమ్మకంతో పూజిస్తుంటారు. రతన్ పూర్ రాజు హయాంలో ఈ ఆలయం నిర్మాణం సాగినట్టు శాసనాలు చెబుతున్నాయి. ఆంజనేయుడు స్వయంగా కలలో కనిపించి గుడి కట్టమని చెప్పడంతో రాజు ఈ మహా మాయకుండ్ వద్ద కనిపించిన విగ్రహంతో ఈ గుడిని నిర్మించాడు. గిర్జిబంద్ లో ఈఆలయాన్ని ఏటా శీతాకాలంలో దర్శించుకోవడానికి అనుకూలంగా సమయం .

స్త్రీ మూర్తిరూపంలో కనిపంచే ఆంజనేయుడ్ని పూజించి కోరే కోరికల తప్పక నెరవేరుతాయని స్థానికుల విశ్వాసం . మిగితా వాటికి భిన్నంగా ఇక్కడ ఆంజనేయుడు దక్షిణ ముఖంగా ఉంటూ దర్శనమిస్తుంటాడు. కుడి వైపు శ్రీరాముడు, ఎడమ వైపు లక్ష్మణుడు ఉంటారు. హనుమంతుని కాళ్ల కింద రాక్షసులు ఉంటారు. హనుమాన్ జయంతి సందర్బంగా ఆలయంలో విశేషపూజలు ఘనంగా జరుగుతుంటాయి. దేవతా రూపంలో ఉన్న స్వామిని పూజిస్తే సంతాన సమస్యలు పరిష్కారం అవుతాయని బలంగా విశ్వసిస్తుంటారు. ఈఆలయానికి దగ్గర్లోనే కాలభైరవ స్వామి విగ్రహం ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు స్త్త్రీ మూర్తి రూపంలో ఉన్న వాయుపుత్రుడ్ని దర్శించుకోవడానికి వస్తుంటారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News