Boat Capsized In UP: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగంది. కౌడియాల నదిలో పడవ బోల్తా పడింది. ఘటన సమయంలో 22 మంది ఉన్నారు. అందులో 13 మందిని రక్షించారు. 8 మంది జాడ మిస్సయ్యింది. 60 ఏళ్ల మహిళ మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు.
యూపీలో పడవ బోల్తా.. ఒకరు మృతి, 8 మంది మిస్సింగ్
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలోని భారత్‌పూర్ సమీపంలోని కౌడియాలా నదిలో పడవ బోల్తా పడింది. బుధవారం సాయంత్రం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో 22 మంది పడవలో ప్రయాణిస్తున్నారు. అయితే ఏం జరిగిందో తెలీదుగానీ, ఒక్కసారిగా పడవ బోల్తా పడింది. 60 ఏళ్ల వృద్ధురాలు నీటిలో మునిగిపోయి మరణించింది.
ఐదుగురు పిల్లలు సహా ఎనిమిది మంది గల్లంతయ్యారు. ప్రయాణికులు పొరుగున ఉన్న లఖింపూర్ జిల్లాలోని ఖైరతియా గ్రామానికి చెందినవారు. వారంతా భారత్‌పూర్‌కు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. నదిలో బలమైన ప్రవాహం కారణంగా బోల్తా పడిందని స్థానికులు చెబుతున్నారు.
దుంగను ఢీ కొన్న పడప, ఆపై బోల్తా
ఈ ఘటనపై బహ్రైచ్ జిల్లా ఎస్పీ ఆర్ఎన్ సింగ్ మాట్లాడారు. గ్రామస్తులు మార్కెట్ నుండి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. పడవ నదిలో ఓ దుంగను ఢీకొన్న పడవ, ఆ తర్వాత సమతుల్యత కోల్పోయి బోల్తా పడిందని చెప్పారు. మొత్తం 22 మందిలో ఎనిమిది మంది జాడ కనిపించలేదన్నారు. 13 మందికి గాయపడ్డారు. ఓ మహిళ మృత్యువాత పడిందని తెలిపారు.
తప్పిపోయిన వ్యక్తుల ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలను ఆ ప్రాంతానికి తరలించినట్టు తెలిపారు. బహ్రైచ్ జిల్లా ప్రధాన కార్యాలయం నుండి భారత్‌పూర్ 122 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ చుట్టుపక్కల గ్రామాల మధ్య కౌడియాల నది ఉంది కౌడియాల నది దట్టమైన అడవులు ఉంటుంది. 1834 నుండి రెవెన్యూ విభాగం ఆ ప్రాంతాన్ని గ్రామంగా గుర్తించింది.
ALSO READ: మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా భారత్, మోదీ ఫ్యూచర్ ప్లానేంటి?
ఈ గ్రామానికి చేరుకోవడం చాలా కష్టం. కతర్నియా ఘాట్ వన్యప్రాణుల అభయారణ్యం గుండా ప్రయాణించి పడవలో గెరువా నదిని దాటాలి. ఆ తర్వాత చాలా దూరం నడిచి అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ జిల్లా అధికారులు ప్రభుత్వ సేవలను అందించడంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. భారత్‌పూర్ ప్రాంతాన్ని 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబా గ్రామ పంచాయతీకి అనుసంధానం చేశారు.
తప్పిపోయినవారిలో బోట్ మేన్ మిహిలాల్ యాదవ్, శివనందన్ మౌర్య, సుమన్, సోహ్ని, శివం, శాంతి ఐదేళ్ల కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. తక్షణమే సహాయ చర్యలు చేపట్టేందుకు NDRF, SDRF బృందాలతోపాటు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవాలని ఆదేశించారు.
యూపీలో పడవ బోల్తా.. ఎనిమిది మంది మృతి!
ఉత్తరప్రదేశ్-భారత్‌పూర్ సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న కౌదియాలా నదిలో పడవ బోల్తా
ఈ ఘటనలో ఓ 60 ఏళ్ల మహిళ నీట మునిగి మృతి
అనంతరం ఐదుగురు పిల్లలతో సహా ఎనిమిది మంది మృతి చెందినట్లు సమాచారం
పొరుగున ఉన్న లఖింపూర్ జిల్లాలోని ఖైరాతియా… pic.twitter.com/q4Qmp9Spk8
— BIG TV Breaking News (@bigtvtelugu) October 30, 2025