BigTV English

Immunity Juices : మీ ఇమ్యూనిటీ పెంచే జ్యూసులు ఇవే

Immunity Juices :  మీ ఇమ్యూనిటీ పెంచే జ్యూసులు ఇవే

Immunity Juices : కరోనా కాలంలో ప్రతి ఒక్కరికి రోగ నిరోధ‌క శ‌క్తి చాలా అవసరంగా మారింది. రోగ నిరోధక శక్తి ఉంటే జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రం ఇలా ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌ను అయినా జయించవచ్చు. అదే ఇమ్యూనిటీ లేకపోతే శ‌రీరం నీర‌సిస్తుంది. అంతేకాకుండా ఎన్నో ఆరోగ్య స‌మ‌స్య‌లు తలెత్తుతాయి. మ‌రి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవడానికి పండ్ల రసాలు ఎంతో ఉపయోగపడతాయి. ‌నీటి శాతం ఎక్కువ‌గా ఉండే పుచ్చ‌కాయ రోగ నిరోధక శ‌క్తిని ఎంతో పెంచుతుంది. ఇన్‌ఫెక్షన్ల బారినపడ్డప్పుడు వచ్చే కండ‌రాల నొప్పిని కూడా త‌గ్గిస్తుంది. పుచ్చ‌కాయ‌లోని గింజ‌లు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అందుకే వాటిని తీసేయ‌కుండానే జ్యూస్ చేసుకుని తాగితే మంచిది. ఏ సీజ‌న్ల‌లో అయినా లభించే ట‌మాటాల్లో విట‌మిన్ సీ, ఈ, బీటా కెరోటిన్ సంవృద్ధిగా ఉంటుంది. ఇవి రోగ నిరోధ‌క శ‌క్తిని త‌గ్గించే ఫ్రీ రాడిక‌ల్స్‌ను అడ్డుకుంటాయి. ప్రతి రోజూ ట‌మాటా జ్యూస్ తాగితే రోగ నిరోధ‌క శ‌క్తితో పాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జ‌రుగుతుంది. ‌నిమ్మ‌, ద్రాక్ష, నారింజ‌లో విట‌మిన్ సీ పుష్క‌లంగా ఉంటుంది. ఇన్ఫెక్ష‌న్ల‌ను త‌గ్గించ‌డంలో విట‌మిన్ సీ బాగా పనిచేస్తుంది. ఈ సిట్ర‌స్ పండ్ల జ్యూస్‌లు తాగితే వ్యాధి నిరోధ‌క శ‌క్తి బాగా పెరుగుతుంది. ‌గుండె ప‌నితీరు మెరుగుప‌డటమే కాకుండా జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా గ్యాస్‌, ఎసిడిటీ నుంచి కూడా చక్కటి ఉప‌శ‌మ‌నం లభిస్తుంది. ‌బీట్‌రూట్లో కూడా విట‌మిన్ సీ, ఈ వంటివి ఎక్కువగా ఉంటాయి. అలాగే కాల్షియం, ఐర‌న్ కూడా బాగా ఉంటుంది. అందుకే ర‌క్త‌హీన‌త‌తో బాధ‌ప‌డేవారు బీట్‌రూట్ జ్యూస్ తాగ‌డం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.బీట్‌రూట్‌లో ఉండే లైకోపిన్, ఆంథోసైయ‌నిన్స్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీని పెంచుతాయి. అంతేకాకుండా అధిక ర‌క్త‌పోటును త‌గ్గించి, పెద్దవాళ్ల‌లో మెద‌డుకు ర‌క్త‌ప్ర‌వాహం పెంచుతాయి. బీట్‌రూట్‌లో వాపు త‌గ్గించే గుణం ఉంది. ఇది కాలేయం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. క్యారెట్ల‌లో విట‌మిన్ ఏ, బీ1, బీ2, బీ3, ఫోలెట్‌, నియాసిన్‌, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియంతో పాటు పీచు కూడా అధికంగా ఉంటుంది. క్యారెట్ జ్యూస్‌లోని బీటా కెరోటిన్ మన కంటి ఆరోగ్యాన్ని బాగా మెరుగుప‌రుస్తుంది. ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. ఇమ్యూనిటీ పెంచడంలో యాపిల్‌ జ్యూస్‌ సమర్థవంతంగా పనిచేస్తుంది. యాపిల్‌లో విట‌మిన్ ఏ, బీ1 బీ2, బీ6, సీతోపాటు ఫోలిక్ యాసిడ్‌, జింక్‌, పొటాషియం, నియాసిన్‌లాంటి ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఇవి మన ఇమ్యూనిటీతో పాటు నరాల వ్యవస్థను కూడా బలోపేతం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×