BigTV English

Romance : స్త్రీ శృంగారం పట్ల ఆసక్తి కోల్పోడానికి కారణం ఇదే..!

Romance : పురుషులకు శారీరక అంగస్తంభన లోపం ఉన్నట్లే.. స్త్రీలు కూడా కొన్ని లక్షణాలను అనుభవిస్తారు. అయితే స్త్రీలు శృంగారం చేయకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. స్త్రీలు శృంగారంపై ఎందుకు ఆసక్తి కోల్పోతారో ఇప్పుడు చూద్దాం.

Romance : స్త్రీ శృంగారం పట్ల ఆసక్తి కోల్పోడానికి కారణం ఇదే..!

Romance : పురుషులకు శారీరక అంగస్తంభన లోపం ఉన్నట్లే.. స్త్రీలు కూడా కొన్ని లక్షణాలను అనుభవిస్తారు. అయితే స్త్రీలు శృంగారం చేయకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. స్త్రీలు శృంగారంపై ఎందుకు ఆసక్తి కోల్పోతారో ఇప్పుడు చూద్దాం.


ఒక వయసు తర్వాత కొంత మంది స్త్రీలకు రిలేషన్‌షిప్‌లో అభిరుచి తగ్గిపోతుంది. స్త్రీకి శృంగారం పట్ల ఆసక్తి తగ్గిపోవడానికి గల కారణాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైన అంశం. తిరిగి శృంగారంపై ఇంటరెస్ట్ రావడానికి ఏం చేయాలో అర్థం చేసుకోవాలి. శృంగారం అనేది శారీరక, మానసిక సమస్యతో సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. స్త్రీలలో సెక్స్ డ్రైవ్ కోరికలు తగ్గిపోవడానికి లక్షణాలు తెలుసుకుందాం.

  • సృంతృప్తి లేని శృంగారం వంటివి శృంగారం మీద ఆసక్తి తగ్గిపోవడానికి కారణాలు కావచ్చు
  • జననేంద్రియాలు లేదా రొమ్ము సంబంధిత కొన్ని శస్త్రచికిత్సలు స్త్రీ శృంగారంపై ఎఫెక్ట్ చూపొచ్చు
  • గుండె పరిస్థితులు, అధిక రక్తపోటు, కొన్ని గుండె సంబంధిత వ్యాధులు శృంగారం కోరికలను తగ్గిస్తాయి.
  • అవగాహన లేని శృంగారం, జననాంగం పొడిబారడం కూడా శృంగారంపై ఆసక్తికి తగ్గించొచ్చు.
  • డయాబెటిస్.. రక్త నాళాలు, నరాలను దెబ్బతీస్తుంది. ఇది మీ శృంగారాన్ని ప్రభావితం చేస్తుంది.
  • థైరాయిడ్ మందులు, కొన్ని ఇతర మందులు స్త్రీలలో శృంగారం తగ్గిస్తాయి
  • పక్షవాతం, నాడీ సంబంధిత జబ్బులు, వెన్నెముకకు గాయాలు, నరాల బలహీనత లాంటివి కూడా శృంగారం కోరికలను నియంత్రిస్తాయి.
  • స్త్రీ జననేంద్రియాల ఆరోగ్యం ఈస్ట్రోజెన్‌పై ఆధారపడి ఉంటుంది. ఈస్ట్రోజన్ స్థాయిలను తగ్గడం వల్ల యోని కణజలాలు పొడిబారతాయి. ఈ సమయంలో శృంగారం అసౌకర్యంగా, బాధాకరంగా ఉంటుంది.
  • గర్భధారణ సమయంలో శరీరంలోని అనేక హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి. దీని కారణంగా మహిళలకు శృంగారంపై ఆసక్తి తగ్గుతుంది.
  • మానసిక ఆందోళనలతో బాధ పడే వారిలో మెదడులో జరిగే రసాయనిక చర్యల ప్రభావం వల్ల శృంగారం మీద అంతగా ఆసక్తి చూపరు.
  • ఆందోళన కలిగిన మనుషుల్లో సెక్స్‌ను ప్రేరేపించేలా మెదడు విడుదల చేసే సెరటోనిన్, డోపమైన్ అనే హార్మోన్లు కూడా మారిపోతాయి. ఇది శృంగారం కోరికలను తగ్గిస్తాయి.
  • స్త్రీలు కొందరు అతిగా ఆలోచిస్తారు. ఆందోళన చెందుతుంటారు. నిరాశగా ఉంటారు. ఇటువంటి కారణాలు కూడా శృంగారాన్ని తగ్గిస్తాయి.
  • జంటల మధ్య లైంగిక సాన్నిహిత్యం లేకపోవడం కూడా స్త్రీలలో లైంగిక కోరిక లేకపోవడానికి దోహదం చేస్తాయి.
  • భాగస్వామి యొక్క తప్పుడు ప్రవర్తన, మానసికంగా అందుబాలులో ఉండకపోవడం, కమ్యూనికేషన్ గ్యాప్ తదితర అంశాల వల్ల స్త్రీలలో శృంగారంపై ఆసక్తి తగ్గుతుంది

ఇలా చెప్పుకుంటూ పోతే స్త్రీలకు శృంగారం కోరికలు లేకపోవడానికి చాలా కారణాలున్నాయి. చాలా ఆలస్యం కాకుండా సమస్యను గుర్తించండి. కాస్త అసౌకర్యంగా ఉన్నప్పటికీ ఇలాంటి సమస్య దంపతుల్లో ఎవరికి ఎదురైనా చర్చించుకోండి. శృంగారం కోరికలు తగ్గడం గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం వల్ల అపార్ధాలు తొలగిపోతాయి.


Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×