BigTV English

National Tourism Day : వారసత్వ కట్టడాల్లో మనమెక్కడ?

National Tourism Day : వారసత్వ కట్టడాల్లో మనమెక్కడ?
National Tourism Day

National Tourism Day : మానవ నాగరికతా క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక అద్భుత నిర్మాణాలు ఉనికిలోకి వచ్చాయి. వాటి విశిష్టతను గుర్తించి, వాటి పరిరక్షణ, ప్రాచుర్యం కోసం UNESCO సంస్థ వాటిని ప్రపంచ వారసత్వ కట్టడాలుగా ప్రకటిస్తోంది. సంఖ్యాపరంగా 2022 – 23 సంవత్సరపు జాబితాలోని దేశాలు, అక్కడి వివరాలు మీకోసం..


58 వారసత్వ కట్టడాలతో యునెస్కో జాబితాలో ఇటలీ తొలిస్థానంలో నిలిచింది. బోలోగ్నా షెల్టర్డ్ వాక్‌వేలు లేదా పోర్టికోలు. అలాగే 14వ శతాబ్దం కాలం నాటి పాడువా ఫ్రెస్కో సైకిళ్లు ఉన్నాయి.

ఈ జాబితాలో చైనా రెండవ స్థానంలో నిలిచింది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనాతో బాటు సమ్మర్ ప్యాలెస్, ఫర్బిడెన్ సిటీ, వెస్ట్రన్ క్వింగ్ టూంబ్స్, టెంపుల్ ఆఫ్ హెవెన్, మింగ్ టూంబ్స్‌తో బాటు వృత్తాకార ప్రాంగణంలోని 46 బహుళ అంతస్తుల భవనాల ఫుజియాన్ టులౌతో సహా 56 ప్రదేశాలు జాబితాలో స్థానం సంపాదించాయి.


ఇక.. ఈ జాబితాలో మూడవ స్థానంలో జర్మనీ నిలిచింది. ఈ దేశంలో మొత్తం 51 వారసత్వ ప్రదేశాలున్నాయి. ఆచెన్ కేథడ్రల్, బెర్లిన్ మోడర్నిజం హౌసింగ్ ఎస్టేట్స్, బౌహాస్, కొలోన్ కేథడ్రల్, క్లాసికల్ వీమర్‌, వాడెన్ సముద్రం వంటివి ఇక్కడి ప్రధాన ప్రదేశాలు.

ప్రశాంత దేశం.. స్పెయిన్ 49 చారిత్రక ప్రదేశాలతో ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. అల్టమిరా గుహలు, అల్హంబ్రా, టీడే నేషనల్ పార్క్, హిస్టారిక్ సెంటర్ ఆఫ్ టోలెడో, కామినో డి శాంటియాగోలను పర్యాటకులు ఇష్టంగా సందర్శిస్తుంటారు.

ఘన చరిత్ర గల ఫ్రాన్స్ 41 వారసత్వ కట్టడాలతో ఐదవ స్థానంలో నిలిచింది. గల్ఫ్ ఆఫ్ పోర్టో, మోంట్ సెయింట్ మిచెల్, రోమన్ థియేటర్, లాగూన్స్ ఆఫ్ న్యూ కలెడోనియా వంటి ప్రసిద్ధ ప్రదేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.

ఇక మనదేశం 40 ప్రపంచ వారసత్వ ప్రదేశాలతో ఆరవ స్థానంలో నిలిచింది. ఇందులో 32 సాంస్కృతిక ప్రదేశాలున్నాయి. కజిరంగా నేషనల్ పార్క్, మానస్ వన్యప్రాణి అభయారణ్యం, సుందర్‌బన్స్ నేషనల్ పార్క్, పశ్చిమ కనుమలు, నందా దేవి నేషనల్ పార్క్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి.

మెక్సికోలో 35 ప్రపంచ వారసత్వ సంపదలను యునెస్కో గుర్తించగా, వాటిలో 33 సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలే. జాబితాలో 7వ స్థానంలో ఉన్న మెక్సికో భారీగా పర్యాటకులను ఆకర్షించే దేశాల్లో ఒకటిగా నిలిచింది.

ఈ జాబితాలో 33 వారసత్వ ప్రదేశాలతో యూకే 8వ స్థానంలో నిలిచింది.

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×