BigTV English

Thursday remedies : గురువారం నాడు చేయాల్సిన పరిహారాలివే…..

Thursday remedies : గురువారం నాడు చేయాల్సిన పరిహారాలివే…..

Thursday remedies : జాతకాలను నమ్మే వారు గురు బలం ఉండాలని, గురు గ్రహం అనుగ్రహం కావాలని కోరుకుంటారు. ఇందుకోసం కొన్ని పరిహారాలను పాటిస్తుంటారు. గురు అనుగ్రహం పొందడానికి గురువారం రోజున ఉపవాసం ఉండాలి. ఇలా ఉపవాసం ప్రారంభించిన తర్వాత 5, 11, లేదా 43 వారాల పాటు ప్రతీ గురువారం ఉపవాసం ఉండాలి.గురువు బలంతో ఐశ్వర్యం పెంచుకునేందుకు ప్రతి గురువారం నాడు పసుపు లేదా కుంకుమను నీటిలో కొద్దిగా కలిపి స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత నాభిలో కుంకుమ పూయాలి.గురువారం రోజున గోశాలలో లేదా మీ ఇంటి దగ్గరికి వచ్చే ఆవులకు అరటికాయలను చిన్నగా తురిమి వాటికి తినిపించాలి. జీవితంలో మీరు గురువుగా భావించే వారందరికీ గురువారం రోజున దుస్తులను దానం చేయాలి లేదా పేదలకు మీ సామర్థ్యం మేరకు దానధర్మాలు చేయాలి. ఇలా చేయడం వల్ల గురు బలం పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.


గురుగ్రహ దోష నివారణకు హయగ్రీవస్తోత్రం పటించాలి..జాతకంలో గురుగ్రహ దోషం ఉన్నవారు ప్రతిరోజు హయగ్రీవ స్తోత్రం చదివితే గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది. భక్తి భావనలు, ఉన్నత విద్య,విదేశి విద్య కలగాలంటే గురుగ్రహ అనుగ్రహం ఉండాలి. గురు గ్రహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గ్రహాలలో అతి పెద్ద గ్రహంగా గురుడినే పరిగణిస్తారు. జ్యోతిష్యాన్ని, . అయితే కొందరికి తమ జాతకంలో గురుడు శుభ స్థానంలో ఉన్నా సానుకూల ఫలితాలు రావు.. మరికొందరి జాతకంలో గురుడు అశుభ స్థానంలో ఉన్న మంచి ఫలితాలొస్తుంటాయి.. గురు బలాన్ని పెంచుకునేందుకు శివసహస్రాణం లేదా రుద్రాభిషేకం చేయడం వల్ల చాలా ప్రభావవంతమైన ఫలితాలొస్తాయి

కొందరు వివాహం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతుంటాయి. ప్రస్తుత రోజుల్లో పెళ్లి కావాలంటే చాలా కష్టం. ముఖ్యంగా అమ్మాయిలకు వివాహం ఆలస్యమైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వారంతా శుక్ల పక్షంలో వచ్చే గురువారం రోజున బంగారు ఉంగరంతో చేసిన పుష్పరాగాన్ని ధరిస్తే ప్రయోజనం ఉంటుందని పండితులు చెబుతున్నారు


Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×