BigTV English
Advertisement

Prabhas Sanjay Dutt: ప్ర‌భాస్ తాత రోల్‌లో కేజీయ‌ఫ్ స్టార్‌

Prabhas Sanjay Dutt: ప్ర‌భాస్ తాత రోల్‌లో కేజీయ‌ఫ్ స్టార్‌

Prabhas Sanjay Dutt: ప్ర‌భాస్ నిన్న మొన్న‌టిదాకా మ‌న స్టార్ కావ‌చ్చు. ఇప్పుడు నాగీ డైర‌క్ష‌న్‌లో చేస్తున్న ప్రాజెక్ట్ కె త‌ర్వాత మ‌న స్టార్ కాక‌పోవ‌చ్చు. ఆ మూవీ రిలీజ్ అయ్యాక ప్ర‌భాస్ సైన్ చేసే సినిమాల‌న్నీ కంప్లీట్‌గా హాలీవుడ్ ప్రాజెక్టులు కావ‌చ్చేమో. ఇప్పుడే ఆయ‌న గురించి హాలీవుడ్ స్థాయిలో అంత మంది ఎంక్వ‌య‌రీ చేస్తున్నారంటే, ప్ర‌భాస్ రేంజ్ ఏ రేంజో మ‌నం అర్థం చేసుకోవాలి. మొన్న మొన్న‌టి ప్ర‌భాస్‌లాగా ఫీల్ అవ్వ‌కూడ‌దు. చేంజ్ అయిన దృశ్యాన్ని అవ‌గాహ‌న చేసుకోవాల‌ని మొన్నీమ‌ధ్య‌నే డీటైల్డ్ గా చెప్పుకొచ్చారు స్టార్ ప్రొడ్యూస‌ర్ అశ్వ‌నీద‌త్‌. ఇప్పుడు ఆయ‌న మాట‌ల‌న్నీ నిజ‌మే అనిపిస్తున్నాయి. ప్ర‌భాస్ కోసం మేం ప‌నిచేస్తామంటే, మేం చేస్తామంటూ ప్ర‌ముఖ స్టార్లు బార్లు తీస్తున్నారు. లేటెస్ట్ గా ప్ర‌భాస్ సినిమాలో నటించ‌డానికి యాక్సెప్ట్ చేశారు సంజ‌య్ ద‌త్‌. సంజూ బాబాకి సౌత్ మూవీస్ కొత్తేం కాదు. కేజీయ‌ఫ్‌లో ఆయ‌న న‌ట‌నా విశ్వ‌రూపాన్ని చూశారు జ‌నాలు. ఆ లుక్‌, మేక‌ప్‌, పెర్ఫార్మెన్స్ నుంచీ ప్ర‌తిదీ అంద‌రినీ అట్రాక్ట్ చేసింది.


ఇప్పుడు సంజ‌య్ ద‌త్… ప్ర‌భాస్‌కి తాత‌గా న‌టించ‌డానికి యాక్సెప్ట్ చేశారు. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ ఓ ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫుల్ అండ్ ఫుల్ యాక్ష‌న్ సినిమాలు చేస్తున్న డార్లింగ్‌, ఆ జోన‌ర్ నుంచి కాస్త ప‌క్క‌కు జ‌రిగి చేస్తున్న సినిమా మారుతిది. ఈ సినిమాలోనే ప్ర‌భాస్‌కి తాత‌గా బాలీవుడ్ యాక్ట‌ర్ సంజ‌య్ ద‌త్ న‌టించ‌డానికి ఒప్పుకున్నార‌ట‌.
తాతా మ‌న‌వ‌ళ్ల మ‌ధ్య వ‌చ్చే క్రూషియ‌ల్ సీన్స్ సినిమా ట‌ర్నింగ్ పాయింటుకి యూజ్ అవుతాయ‌ట‌. క‌థ విన‌గానే సంజ‌య్ ద‌త్ ఓకే చెప్పేసిన‌ట్టు స‌మాచారం. బాలీవుడ్ ఆర్టిస్టులు మ‌న హీరోల‌కు తాత‌లుగా న‌టించిన చాలా సినిమాలు మ‌న ద‌గ్గ‌ర సూప‌ర్‌డూప‌ర్ హిట్ అయ్యాయి. ఆ ఖాతాలో ప్ర‌భాస్ మ‌న‌వ‌డిగా, సంజ‌య్‌ద‌త్ తాత‌గా న‌టించే ఈ సినిమా కూడా సెంటిమెంట్‌ని రూల్ చేస్తుంద‌ని అంటున్నారు ఫ్యాన్స్. ఇటీవ‌లే క్యాన్స‌ర్ నుంచి స‌ర్వైవ్ అయ్యారు సంజ‌య్‌ద‌త్‌.


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×