E-Paper
Advertisement

Tirupati Srivari Darshan: మార్చి 1 నుంచి శ్రీవారి దర్శనంలో మార్పులు ఉంటాయా….

Tirupati Srivari Darshan: మార్చి 1 నుంచి శ్రీవారి దర్శనంలో మార్పులు ఉంటాయా….
Advertisement

Tirupati Srivari Darshan:తిరుమల శ్రీవారి ఆనంద నిలయం బంగారుయం కానుంది. మార్చిలో పనులు ప్రారంభం కాబోతున్నాయి.. ఇప్పటికే భక్తుల నుంచి పెద్ద మొత్తంలో బంగారం కానుకలు, విరాళాల రూపంలో సేకరించింది తిరుమల తిరుపతి దేవస్థానం. అయితే ఆనందనిలయం బంగారు తాపడం పనుల కోసం ఆరునెలల పాటు శ్రీవారి దర్శనం నిలుపుదల చేస్తున్నట్లు వస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో భక్తుల్లో అయోమయం నెలకొంది. అయితే వార్తల్లో నిజం లేదని శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరైన వేణుగోపాల దీక్షితులు క్లారిటీ ఇచ్చారు. . టీటీడీ ఆగమ సలహామండలి సూచనల మేరకు తిరుమల శ్రీవారి ఆనందనిలయం బంగారు తాపడం పనులు ప్రారంభించి ఆరు నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించిందన్నారు.

మార్చి ఒకటిన బాలాలయం ఏర్పాటుకు ఆలయ అర్చకులు ముహూర్తంగా నిర్ణయించారు. ముందుగా వారం రోజులపాటు బాలాలయ నిర్మాణానికి అవసరమైన వైదిక క్రతువులు నిర్వహించే ప్రక్రియకు ఏర్పాట్లు చేస్తారు. తర్వాత గర్భాలయంలోని మూలమూర్తి జీవకళలను కుంభంలోకి ఆవాహన చేసి బాలాలయంలో ఏర్పాటు చేసే దారు శ్రీ వేంకటేశ్వర స్వామివారి విగ్రహంలోకి ప్రవేశపెడతారు .ఈ ప్రక్రియం జరిగిన తర్వాతే ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు మొదలువుతాయి. .

Advertisement

ఆనంద నిలయంలో తాపడం పనుల కోసం సుమారు ఆరు నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఆరు నెలలు గర్భాలయంలోని మూలమూర్తిని భక్తులు యథావిధిగా దర్శించుకోవచ్చని పేర్కొన్నారు. ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారికి నిర్వహించే కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలన్నీ యథావిధిగా జరుగుతాయని తిరుపతి తిరుపతి దేవస్థానం ప్రకటించింది. భక్తులు యధావిధిగా స్వామి వారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×