Big Stories

Trees :- చెట్లను కూడా పూజించే ఆచారం ఎప్పటి నుంచి మొదలైంది…

- Advertisement -

Trees :- ప్రాచీన కాలం నుంచి చెట్లను దైవంగా భావించి పూజ చేయడం ఆచారంగా వస్తోంది. చెట్టూ పుట్టా, రాతిలో కూడా దైవాన్ని చూస్తూ బతకడం మన దేశం మనకు నేర్పిన సంస్కృతి. వందల సంవత్సరాలు గడిచిపోతున్నా ఇప్పటికీ ఆ సంస్కృతి కొనసాగుతూనే ఉంది. పద్దతులు మారినా పూజలు కొనసాగుతూనే ఉన్నాయి. తులసీ మొక్కల పూజ చేసే పద్దతి ఈ యుగం నాటిది కాదు. ఉదయాన్నే ఇంటి గుమ్మం ఎదురుగా తులసిని పెంచుకుని, ఉదయాన్నే లేవగానే పూజలు చేస్తున్నూనే ఉన్నాం. జంతువులను కూడా దేవుళ్లుగా భావించి పూజిస్తాం.

- Advertisement -

చరాచర సృష్టిని ఏర్పాటు చేసిన ఆ భగవంతుడు మనిషి కోసమే మొక్కల్ని , జంతువులను సృష్టించాడు.ప్రతీ మనిషిలో దేవుడు ఉన్నట్టే వృక్షాలలో, జంతువులలో కూడా కొలువై ఉంటాడనే నమ్మకాన్ని పూర్వీకులు గుర్తించారు. మనిషి బతికేందుకు అవసరమైన గాలిని ఆక్సిజన్ రూపంలో పచ్చని మొక్కలు అందిస్తున్నాయి. కాబ్బటి చెట్టుకి మొక్కడంలో మూర్ఖత్వం మూఢ నమ్మకంగా భావించడం సహేతుకం కాదు. భూమిపై ఉన్న వేలాది వృక్షాలు పళ్లను, ఔషదాలను ప్రసాదిస్తూనే ఉన్నాయి.

జంతువులు కూడా మనిషికి అవసరమైన ప్రాణాధార వనరులను అందిస్తున్నాయి. మన వల్ల వాటికి ఉపయోగం లేకపోయినా వాటి వల్ల మనకి ఎన్నోప్రయోజనాలున్నాయి. వాటికి మనం సాయం చేయపోయినా అవే మనకి ఉపయోగపడుతుంటాయి. అందుకే మన పెద్దలు చెట్లు, జంతువుల్ని కూడా భక్తితో పూజించి, అంతరించిపోకుండా ఎన్నో జాగ్రత్తలు ఏర్పాటు చేశారు. చెట్లను నరికితే పాపమనే భావన కలిగించడానికి కారణం ఇదే. అనివార్య పరిస్థితుల్లో చెట్లను తొలగించాల్సి వస్తే పూజలు, క్షమాపణలు చెప్పాలని కూడా చెప్పారు. పాప పరిహారాలను శాస్త్రాల్లో ఉదహరించారు. మౌనంగానే మనిషి మనుగడికి అవసరమైన వనరులను అందిస్తున్న వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడం మన కనీస కర్తవ్యం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News