Big Stories

Komatireddy: ప్రియాంక సభకు కోమటిరెడ్డి డుమ్మా.. ఈసారి వేటు పక్కా?

komatireddy venkat reddy

Komatireddy Venkat Reddy News(): కాంగ్రెస్ యువ సంఘర్షణ సభ. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్. ప్రియాంకగాంధీ హాజరు.. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం. ప్రియాంకగాంధీ వస్తారంటూ నెల రోజుల ముందునుంచీ హోరెత్తుతోంది. 10 రోజులు ముందుగానే షెడ్యూల్ ప్రకటించారు. పెద్ద ఎత్తున సభకు ఏర్పాట్లు చేశారు. 5 అంశాలతో యూత్ డిక్లరేషన్ అనౌన్స్ చేశారు. సోనియా బిడ్డగా మాట ఇస్తున్నా.. హామీలన్నీ నెరవేరుస్తాం.. లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేయండి అంటూ ప్రియాంకగాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ యువ సంఘర్షణ సభ.. గ్రాండ్ సక్సెస్. యూత్ డిక్లరేషన్‌లోని 5 హామీలతో తెలంగాణవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్య నడుస్తోంది. దీనితో పాటు మరో అంశమూ అంతే చర్చనీయాంశమైంది. అదే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇష్యూ.

- Advertisement -

ఇంతటి ప్రతిష్టాత్మక సభకు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి డుమ్మా కొట్టారు. ప్రియాంక గాంధీ వచ్చినా.. ఈయన మాత్రం రాలేదు. ఎందుకు రాలేదంటే.. విదేశాల్లో ఉన్నారు.. ఈ విషయం ప్రియాంకగాంధీ కార్యాలయానికి ముందే సమాచారం అందించాం.. అంటూ ఆయన సిబ్బంది చెబుతున్నారు. సిల్లీగా లేదా? అంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు.

- Advertisement -

ఇటీవల నల్లగొండలో జరిగిన నిరుద్యోగ ర్యాలీలో కాంగ్రెస్ నేతలంతా కలిసిపోయినట్టే అనిపించారు. రేవంత్, ఉత్తమ్, జానారెడ్డి, కోమటిరెడ్డి, వీహెచ్.. సీనియర్లంతా చేతులు కలిపి, కౌగిలింతలు ఇచ్చుకుని, ఒకే దండలో ఒదిగిపోయి.. కేడర్‌కు మంచి మెసేజ్ ఇచ్చారు. ఆ ర్యాలీలో ఒకరినొకరు పొగుడుకుంటూ.. జోకులేసుకుంటూ.. మేమంతా ఒక్కటేనని చాటిచెప్పారు. కట్ చేస్తే, సరూర్ నగర్ సభకు ఎంపీ కోమటిరెడ్డి ఎగ్గొట్టడం దారుణం అంటున్నారు. ప్రియాంక సభకు రాకపోవడం క్షమించరాని తప్పిదం అని మండిపడుతున్నారు కార్యకర్తలు.

ఇప్పుడే కాదు.. మునుగోడు ఎన్నికల సమయంలోనూ కోమటిరెడ్డి తీరు ఇలానే ఉంది. ఓవైపు ఎన్నికల ప్రచారం, పోలింగ్ హెరెత్తుతుండగా.. ఆయన మాత్రం తీరిగ్గా ఆస్ట్రేలియా ట్రిప్ వేశారు. ఎలక్షన్లను వదిలేసి.. విదేశాలకు చెక్కేశారు. అక్కడితో ఊరుకున్నారా అంటే లేదు. ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేసి.. కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయకండి.. నా సోదరుడు, బీజేపీ కేండిడేట్ రాజగోపాల్ రెడ్డికే ఓటేయండంటూ పార్టీ కార్యకర్తకు చెప్పడం తీవ్ర వివాదాస్పదమైంది. అప్పట్లోనే ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చినా.. ఎందుకో చర్యలు మాత్రం తీసుకోలేదు. మరోసారి, కీలక సమయంలో పార్టీకి హ్యాండ్ ఇచ్చి.. ఫారిన్ వెళ్లిపోవడం.. అదికూడా ప్రియాంకాగాంధీ హాజరయ్యే సభకు డుమ్మా కొట్టడాన్ని అధిష్టానం సీరియస్‌గా తీసుకోవాల్సిందేననేది కాంగ్రెస్ కేడర్ డిమాండ్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News