E-Paper
Advertisement

TS High Court : తెలంగాణ జిల్లా కోర్టుల్లో 1226 ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులు.. నోటిఫికేషన్ జారీ..

TS High Court : తెలంగాణ జిల్లా కోర్టుల్లో 1226 ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులు.. నోటిఫికేషన్ జారీ..
Advertisement

TS High Court : తెలంగాణ జ్యుడీషియల్‌ మినిస్టీరియల్‌ సర్వీసులో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం ఏడో తరగతి ఉత్తీర్ణత సాధించాలి. పదో తరగతి కంటే ఎక్కువ విద్యార్హత ఉన్నవారు అనర్హులు. అభ్యర్థులు దరఖాస్తులో వృత్తిపరమైన నైపుణ్యాలు పేర్కొనాలి. స్థానిక భాషలు తెలిసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 34 ఏళ్లు మించరాదు. ఎస్సీ , ఎస్టీ, బీసీ , ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు , దివ్యాంగులకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఇచ్చారు.

అభ్యర్థులకు నిర్వహించే పరీక్షలో 45 ప్రశ్నలుంటాయి. జనరల్‌ నాలెడ్జ్‌లో 30, జనరల్‌ ఇంగ్లిష్‌లో 15 ప్రశ్నలుంటాయి. ప్రశ్నకు ఒక మార్కు చొప్పున కేటాయించారు. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు.

Advertisement

మొత్తం పోస్టులు :1226
అర్హత : ఏడో తరగతి ఉత్తీర్ణత
వయసు : 01-07-2022 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక : సీబీటీ/ ఓఎంఆర్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
ప్రశ్నపత్రం : కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(సీబీటీ)
దరఖాస్తు రుసుం : ఓసీ/ ఓబీసీలకు రూ. 600 (ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌లకు రూ.400)
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం : 11-01-2023
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ : 31-01-2023
కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష తేదీ : మార్చి 2023

వెబ్‌సైట్‌: https://tshc.gov.in/getRecruitDetails

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×