BigTV English

Vastu Tips : మీ ఇంట్లో ఇత్తడి పాత్రలు ఉన్నాయా.. అయితే ఈపని చేయండి

Vastu Tips : మీ ఇంట్లో ఇత్తడి పాత్రలు ఉన్నాయా.. అయితే ఈపని చేయండి

Vastu Tips : ఏవైనా వాస్తు దోషాలు ఉన్నాయంటే ఆ ఇంట్లో ఉన్న వారంద‌రికీ క‌ష్టాలు వ‌స్తుంటాయి. ఏదో రూపంలో వారిని వెంటాడుతుంటాయి. అవి అస‌లు అంత ఈజీగా ఒక ప‌ట్టాన పోవు. ఇంట్లో ఉన్న అంద‌రూ ఇబ్బందులు ప‌డుతుంటారు. ముఖ్యంగా ఏ ప‌ని చేసినా అస‌లు క‌ల‌సి రాదు. ఆర్థిక స‌మ‌స్య‌లు ఉంటాయి. అంద‌రూ త‌రచూ అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతుంటారు. ఎవ‌రి ఇంట్లో అయినా ఈ విధంగా స‌మ‌స్య‌లు వ‌స్తుంటే.. అప్పుడు వారి ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయ‌ని అర్థం చేసుకోవాలి. సమస్యల నుంచి బయటపడాలంటే ఇంట్లో ఎన్న నెగెటివ్ ఎన‌ర్జీ పోయి పాజిటివ్ ఎన‌ర్జీ ఉండాలి. దీంతో వాస్తు దోషాలు పోయి క‌ష్టాల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.


భారతీయ సంప్రదాయం ప్రకారం ఇంట్లో ఇత్తడి పాత్రలను ఉంచడం మంగళకరమైనదిగా భావిస్తారు. ఆరోగ్యం పరంగా, ఇత్తడి పాత్రల ద్వారా తయారు చేసే ఆహారం రుచిగా ఉండి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఇత్తడి పాత్ర త్వరగా వేడి చేస్తుంది, ఇది గ్యాస్ మరియు ఇతర శక్తి వినియోగాన్ని తగ్గిస్తుంది. ఇత్తడి పాత్రలు ఇతర పాత్రల కంటే కూడా బలంగా ఉంటాయి. ఇత్తడి పాత్రలో ఉంచిన నీరు అపారమైన శక్తిని ఇస్తుంది

వాస్తు సమస్యలు ఎదుర్కొనే వారు సూర్యుడి బొమ్మ కింద‌నే ఇత్త‌డితో తయారు చేసిన స్వ‌స్తిక్ బొమ్మ‌ను ఉంచాలి. ఇలా చేస్తే మ‌నం ఏ ప‌నిచేసినా విజ‌యం కలుగుతుంది. క‌ష్టాలు అస‌లు రావు. ఏ స‌మ‌స్య అయినా స‌రే ఇట్టే ప‌రిష్కారం అవుతుంది. ఇంట్లో ఈశాన్య దిశ‌లో ఒక భారీ ఇత్త‌డి పాత్ర‌ను ఉంచాలి. అందులో మొత్తం నీళ్ల‌ను నింపాలి. పదిహేను రోజులకు ఒక‌సారి ఆ నీటిని మారుస్తుండాలి. ఇలా చేస్తే మ‌న ఇంట్లో కూడా ధ‌నం అలా క‌ల‌కాలం నిలిచి ఉంటుంది. ఆర్థిక స‌మ‌స్య‌లు అస‌లు ఉండ‌వు. ధ‌నవృద్ధి కలుగుతుంది . లక్ష్మీదేవి కటాక్షం కలిగి కష్టాలు తీరతాయి.


ఇత్తడి పాత్రల ప్రాముఖ్యతను కూడా జ్యోతిష్యశాస్త్రం , ధార్మిక గ్రంధాలలో అనేక చోట్ల ప్రస్తావించటం జరిగింది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, సువర్ణ ,ఇత్తడి వంటి పసుపు రంగు బృహస్పతికి ప్రాతినిధ్యం వహిస్తుంది. బృహస్పతి గ్రహాన్ని శాంతింపచేయడానికి ఇత్తడి ని కూడా ఉపయోగిస్తారు.సూర్యుడు స‌క‌ల ప్రాణికోటికి వెలుగునిస్తాడు. అనంత‌మైన శ‌క్తికి ఆయ‌న ప్ర‌తిరూపం. అందువ‌ల్ల ఆయ‌న బొమ్మ ఇంటి ప్ర‌ధాన ద్వారం పైన మ‌ధ్య‌లో ఉంటే.. ఇంట్లోకి పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది. నెగెటివ్ ఎన‌ర్జీ పోతుంది. దుష్ట శ‌క్తుల నుంచి విముక్తి ల‌భిస్తుంది. ఫ‌లితంగా ఇంట్లోని వారికి క‌ష్టాలు త‌ప్పుతాయి. సూర్యుడు అన్నింటా మ‌న‌కు విజ‌యాల‌ను అందిస్తాడు..

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×