BigTV English
Advertisement

Astro Vastu : వాస్తు ప్రకారం ఇంటికి ఎన్నిద్వారాలు ఉండాలి?

Astro Vastu : వాస్తు ప్రకారం ఇంటికి ఎన్నిద్వారాలు ఉండాలి?

Astro Vastu : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ద్వారాలకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇంటి ద్వారాల సంఖ్య ప్రకారం ఇంటిలో నివసించే కుటుంబ సభ్యుల ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పచ్చు అంటోంది వాస్తుశాస్త్రం.


గృహమునకు ద్వారాల సంఖ్య మరియు గుమ్మాలు ఉండే దిక్కు,దిశ ,కొలతలు అనేవి చాలా ప్రధానమైన విషయముగా భావించాలి. వాస్తురీత్యా సూచించిన సరియైన గుమ్మాల సంఖ్య ఉన్నట్టయితే ఆ ఇంట్లో నివసించే వారు ఆరోగ్యంగా , అన్యోన్యంగా ఉంటూ, ఒకరి కొకరు సహకరించుకుని ఆనందమయంగా దిన దిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ఉంటారు.శాస్త్రానికి భిన్నంగా గుమ్మాల సంఖ్య ఉన్నట్లయితే ఆ కుటుంబంలో కలతలు, కలహాలు, అనారోగ్యాలు, ఇతర అనేక కష్టనష్టాలను కలిగిస్తుంది

శుభాన్ని కలిగించే ద్వారాల సంఖ్య ఫలితాలు.రెండు ఇల్లు చాలా శ్రేష్టము. దీనివలన అభివృద్ధి కలుగుతుంది. 4 ద్వారాలు ఉన్న గృహంలో ఆయువు, ఆరోగ్యం, కృషికి లాభము, సమాజంలో గౌరవాన్ని కలిగిస్తుంది, ఆరు ద్వారాలున్న ఇంట్లో ఐశ్వర్యము, పుత్ర వృద్ధి, ఎనిమిది గుమ్మాలు ఉన్న గృహములో సకల భోగభాగ్యములు, అష్టైశ్వర్యములను కలిగిస్తుంది.


పన్నెండు ద్వారముల ఇల్లు ఉద్యోగ, వ్యాపారములలో వృద్ధిని, కీర్తిని కలిగిస్తుంది. 16 గుమ్మాల సంఖ్యను శుభప్రదంగానే భావించాలి. గుమ్మాలు ఎప్పుడు బేసి సంఖ్యలో ఉండకూడదు. అంటే 3,5,7,9, సంఖ్యల్లో ద్వారాలు ఉండకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. బాత్‌రూమ్ ద్వారాలు గుమ్మాల కింద పరిగణించకూడదు.

Related News

Karthika Masam 2025: కార్తీక మాసం చివరి సోమవారం.. ఇలా పూజ చేస్తే శివయ్య అనుగ్రహం

Shani Puja: ఈ నాలుగు పనులు చేశారంటే శని దేవుడు మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు

Vastu tips: మహిళలు నిలబడి చేయకూడని పనులు ఇవన్నీ.. చేస్తే పాపం చుట్టుకుంటుంది

Vastu tips: మీ ఇంట్లో ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం వల్ల జరిగేది ఇదే

Vastu Tips: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా ? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి !

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Big Stories

×