EPAPER

Twitter : ట్విట్టర్ మరో ట్విస్ట్… వాళ్లకు 8 డాలర్ల రూల్ వర్తించదు. భారత్ లో నెల రోజుల్లో సబ్ స్క్రిప్షన్ సర్వీస్

Twitter : ట్విట్టర్ మరో ట్విస్ట్… వాళ్లకు 8 డాలర్ల రూల్ వర్తించదు. భారత్ లో నెల రోజుల్లో సబ్ స్క్రిప్షన్ సర్వీస్

Twitter : ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ యూజర్లకు రోజుకో ట్విస్ట్ ఇస్తున్నారు. బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు నెలకు 8 డాలర్లు చెల్లించాల్సిందేనని అచిరిమరీ చెప్పారు. ఇంతలోనే మాట మార్చి కొందరికి మినహాయింపును ఇచ్చారు. ఇప్పటికే బ్లూటిక్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న సబ్ స్క్రిప్షన్లకు ఈ రూల్ వర్తించదని ప్రకటించినట్లు సమాచారం. అడ్వర్టైజర్లు అడిగిన ప్రశ్నలకు ట్విట్టర్ ఇచ్చిన సమాధానాల్లో ఈ విషయం ఉన్నట్లు ది వెర్జ్ లో ఓ కథనం వచ్చింది. ఇక్కడ మరో కథనం కూడా వినిపిస్తోంది. ఇప్పటికే అకౌంట్స్ వెరిఫై చేయించుకున్నవారు 3 నెలల్లో 8 డాలర్లు చెల్లించి సబ్ స్క్రిప్షన్ చేయించుకోవాలని, లేనట్లయితే అకౌంట్ ని రద్దు చేయాలనేది అసలు ప్లాన్ అనేది దాని సారాంశం. ఏదిఏమైనా బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ పేరుతో భారీగా ఆదాయం పొందాలనేది ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ ప్లాన్. మరోవైపు భారత్ లో నెల రోజుల్లోనే 8 డాలర్ల బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ సర్వీస్ ని అందుబాటులోకి తీసుకురానుంది ట్విట్టర్.
బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ విషయంలో కొన్ని సడలింపులు, మినహాయింపులు ట్విట్టర్ ఇస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా లార్జ్ బ్రాండ్ అడ్వర్టైజర్లలో వెరిఫైడ్ అకౌంట్స్ ఉన్నవారికి ఈ వారంలో ట్విట్టర్ బ్లూ టిక్ రీ లాంచ్ చేసిన తర్వాత అదనంగా అఫిషియల్ అనే లేబుల్ ను ఇవ్వనుంది. అటు అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరుగనున్న తరుణంలో ట్విట్టర్… $8 బ్లూటిక్ వెరిఫికేషన్ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తోంది.
స్పామ్ అకౌంట్స్ భరతం పట్టాలని పట్టుదలగా ఉన్న ఎలాన్ మస్క్ రియల్ అకౌంట్స్ ని గుర్తించడం కోసమని బ్లూటిక్ ఫీజును తెరపైకి తెచ్చారు. నిజానికి ఇప్పటికే రోజుకు 32 కోట్లకుపైగా నష్టాలను చవిచూస్తున్న ట్విట్టర్ ని ఈ గండం నుంచి గట్టెక్కించడానికే ఇదంతా చేస్తున్నారంటారు నిపుణులు. మరోవైపు న్యూ బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ రోల్ అవుట్ చేయాలని… లేదంటే ఇక ఇంటికే అంటూ ఎలాన్ మస్క్ ఇప్పటికే ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చారు. ఈ ఫీచర్ల కోసమే ఇప్పటికే తీసేసిన కొంతమంది ఉద్యోగులను వెనక్కి పిలిపించుకుంటున్నారు.


Tags

Related News

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Delivery boy: ఆర్డర్ ఇచ్చేందుకు వచ్చి.. వివాహితపై డెలివరీ బాయ్ అత్యాచారయత్నం!

Duleep Trophy: దులీప్ ట్రోఫీ.. రెండో రౌండ్‌కు టీమ్స్ ఎంపిక.. జట్టులోకి తెలుగు కుర్రాడు

Big Stories

×