BigTV English

Trump – Israel : ఉక్రెయిన్ చేతికి ప్రమాదకర ఆయుధాలు అందించిన ట్రంప్..

Trump – Israel : ఉక్రెయిన్ చేతికి ప్రమాదకర ఆయుధాలు అందించిన ట్రంప్..

Trump – Israel : హమాస్ తో యుద్ధం వేళ కీలక ఆయుధాల సరఫరాను నిలిపివేసిన బైడెన్ నిర్ణయాన్ని ట్రంప్ తొలగించారు. చాలా రోజులుగా ఇజ్రాయిల్ దళాలు కోరుతున్న బాంబులను ఆ దేశానికి పంపేందుకు ఆమోద ముద్ర వేశారు. దాంతో.. శక్తివంతమైన బాంబులు ఇజ్రాయిల్ దళాలకు గంటల వ్యవధిలోనే చేరనున్నాయి. దీంతో.. ఇజ్రాయిల్ సైన్యం సంతోషం వ్యక్తం చేశారు. కాగా.. ప్రస్తుత నిర్ణయంతో 2000 పౌండ్ల బరువున్న బాంబులను అమెరికా సరఫరా చేయనుంది. అంటే.. దాదాపు 1,800 ఎంకే-84 బాంబులను పంపనున్నారు. వీటినే బంకర్ బస్టర్లు అంటుంటారు.


ఈ బాంబులను ఇజ్రాయిల్ దళాలు గాజాపై ప్రయోగిస్తున్నాయంటూ ఆరోపణలు వెలువడ్డాయి. పాలస్తీనా ఎన్‌క్లేవ్‌లో ఇజ్రాయిల్ దళాలు పౌర నివాసాల ప్రయోగిస్తున్నారని, ముఖ్యంగా గాజాలోని రఫాలో వీటి ప్రభావం ఎక్కువగా ఉందంటూ ఆందోళనలు చెలరేగాయి. దాంతో.. బైడెన్ ప్రభుత్వం ఈ బాంబుల సరఫరాను నిలిపి వేసింది. అప్పటి నుంటి సరఫరాకు సిద్ధంగా ఉంచిన బాంబులు గోదాముల్లో సిద్ధం చేసి పెట్టారు. తాజాగా ట్రంప్ ఆర్డర్లతో ఆ బాంబులను ఇజ్రాయిల్ దళాలకు చేర్చనున్నారు. ఈ విషయాన్ని పెంటగాన్ ప్రతినిధులు ఇజ్రాయిల్ సైన్యానికి తెలిపాయి.

ఇదే అంశంపై ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. ఆ బాంబుల సరఫరాను ప్రారంభించామని, త్వరలోనే వారికి అవి చేరతాయని తెలిపారు. తీవ్ర అందోళనలు వ్యక్తం అవుతున్న శక్తివంతమైన బాంబులను ఎందుకు విడుదల చేశారని ప్రశ్నించగా.. వారు వాటిని కొనుగోలు చేశారని, అప్పటికే డబ్బులు చెల్లించారంటూ తెలిపారు. అంతకు ముందు ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ట్రంప్.. ఇజ్రాయెల్ ఆర్డర్ చేసి, డబ్బులు చెల్లించిన చాలా విషయాలు బైడన్ యంత్రాంగం పెండింగ్ లో పెట్టిందని తెలిపారు. ఇప్పుడు.. అవన్నీ తిరిగి ఇజ్రాయిల్ కు అందుతాయని, ఇప్పటికే ఆ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు


అంతర్జాతీయంగా ఎన్నో వర్గాల నుంచి ఒత్తిడి వచ్చినా ట్రంప్ తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. ఇజ్రాయిల్ కు మొదటి నుంచి బలమైన సపోర్టు చేస్తూ వచ్చిన ఆయన అందుకు తగ్గట్టే అధికారం చేపట్టిన తర్వాతా ఆయుధాలను అందిస్తూ వస్తున్నారు. దీంతో.. ఇజ్రాయిల్ కు భారీ ఊరట కలిగింది. లేదంటే.. ఆయుధాల కోసం తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. వాస్తవానికి బైడెన్ పదవీ కాలం చివర్లో ఈ బంకర్ బాంబులను నిలుపుదల చేయడంతో ఇరు దేశాల మధ్య విభేదాలు వచ్చాయి. ఒకానొక దశలో ఆ బాంబులను స్వదేశీయంగా తయారు చేసుకోవాలని ఇజ్రాయిల్ భావించింది. ఇందుకోసం కొన్ని ఆర్టినరీ ఫ్యాక్టరీలకు ఆర్డర్లు కూడా ఇచ్చేసింది.

Also Read : ఉమ్మడిగా రక్షణ ఉత్పత్తుల తయారీకి ఆ దేశంతో భారత్ ఒప్పందం.. చైనానే టార్గెట్ గా వ్యూహాలు..

రెండేళ్లుగా సాగుతున్న హమాస్, ఇజ్రాయిల్ మధ్య ఇటీవలే కాల్పుల విమరణ ఒప్పందం కుదిరింది. ఇజ్రాయెల్ చేతిలోని పాలస్తీనా ఖైదీలను విడుదల చేయగా.. బదులుగా హమాస్ చేతిలోని ఇజ్రాయెలీ బందీలు విడుదల అయ్యారు. జనవరి 20న తన ప్రమాణ స్వీకారోత్సవానికి ముందే ఈ యుద్ధంపై ప్రకటన చేసిన ట్రంప్.. గాజాలో హమాస్ చేతిలో బందీలుగా ఉన్నవారిని విడుదల చేయకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాగా.. అక్టోబరు 7, 2023న ఇజ్రాయెల్‌పై మత ఛాందస వాద హమాస్ చేసిన దాడిలో 250 మంది ఇజ్రాయిలీలను బందీలుగా పట్టుకుంది. మరో 1,200 వందల మందిని హతమార్చింది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×