Realme 14 Pro Plus : రియల్ మీ 14 ప్రో ప్లస్.. జనవరి 16న ఇండియాలో గ్రాండ్ గా లాంచ్ అయింది. ఈ మొబైల్ ఫస్ట్ లుక్ ను లాంచ్ చేసినప్పుడే ఈ కంపెనీ కొన్ని ఫీచర్స్ ను షేర్ చేసింది. ఇప్పుడు తాజాగా లాంచ్ అయిన మొబైల్ లో మరిన్ని ఆధునాతన ఫీచర్స్ ను తీసుకొచ్చేసింది. మరి ఈ మొబైల్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి.. యూజర్స్ ఏమంటున్నారో తెలుసుకుందాం.
రియల్ మీ 14 ప్రో ప్లస్.. ఎప్పటికప్పుడు తన యూజర్స్ కోసం లేటెస్ట్ మొబైల్స్ ను అందుబాటు ధరల్లోనే తీసుకొస్తున్న ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ. ఈ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంఛ్ చేసిన సిరీస్ రియల్ మీ 14 ప్రో. ఇందులో భాగంగా రియల్ మీ 14 ప్రో మొబైల్ తో పాటు రియల్ మీ 14 ప్లస్ మొబైల్స్ వచ్చేసాయి. బెస్ట్ ప్రీమియం మొబైల్స్ గా వచ్చేసిన ఈ మొబైల్ ఫీచర్స్ అదిరిపోయేలా ఉన్నాయి. ఇందులో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 త్రీ ప్రాసెసర్ తో పాటు 12GB + 256 GB స్టోరేజ్ అందుబాటులో ఉంది. 6000mah బ్యాటరీతో పాటు 80W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. వీటితో పాటు కెమెరా ఫీచర్స్ సైతం అదిరిపోయేలా ఉన్నాయి. 50MP సోనీ కెమెరా, 50mp sony స్పెషల్ కెమెరా, అల్ట్రావైడ్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉన్నాయి. బ్లూటూత్ 5.2 కనెక్టివిటీతో పాటు వైఫై 6 కనెక్టివిటీ కూడా ఉంది. పెరల్ వైట్, స్వెడ్ గ్రే, బికనెర్ పర్పుల్ కలర్స్ లో అందుబాటులోకి వచ్చేసింది.
ALSO READ : రెడ్ మీ, పోకోకు పోటీగా ఐక్యూ కొత్త మెుబైల్.. ఫీచర్స్ కెవ్వుకేక అంతే!
ఇక ఈ మొబైల్లో రియల్ మీ తన పాత మోడల్స్ తో పోలిస్తే అధునాతన ఫీచర్స్ ను తీసుకొచ్చిందనే చెప్పాలి. హై ఎండ్ స్మార్ట్ ఫోన్స్ తో పోలిస్తే అందుబాటు ధరల్లో బెస్ట్ ప్రీమియం మొబైల్స్ ను తీసుకువచ్చిందని టెక్ ప్రియులు అంచనా వేస్తున్నారు. ఇందులో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం Ip66, IP68, IP69 రేటింగ్స్ కూడా ఉన్నాయి. దీంతో పాటు ఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5K రిజల్యూషన్ సైతం అందుబాటులో ఉంది. గేమింగ్ కోసం బెస్ట్ ఎక్స్పీరియన్స్ మొబైల్ కావాలనుకునే వారు ఈ మొబైల్ ను ట్రై చేయవచ్చు. ఫోటోగ్రఫీ కోసం బెస్ట్ మొబైల్ కావాలనుకునే యూజర్స్ కు ఇది బెస్ట్ ఆప్షన్. ఈ కెమెరాలో ఏఐ ఫీచర్స్ తో పాటు అధునాతన పోర్ట్రైట్ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో వచ్చే 80W ఫాస్ట్ ఛార్జింగ్తో ఒక గంటలోనే ఫుల్ ఛార్జ్ చేసుకుని ఛాన్స్ ఉంటుంది.
ఇక రూ.30 వేలలో బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే యూజర్స్ కు రియల్ మీ 14 ప్లస్ బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ సదుపాయం కావాలనుకునే యూజర్స్ తో పాటు కెమెరా డిజైన్, బ్యాటరీతో సహా అధునాతన ఫీచర్స్ ఈ మొబైల్స్ సొంతం. ప్రీమియం లక్ తో పాటు బెస్ట్ ఎక్స్పీరియన్స్ మెుబైల్ పొందాలనుకునే యూజర్స్ ఈ మొబైల్ ను కచ్చితంగా ట్రై చేయొచ్చు.