BigTV English

Washington Post:’వాషింగ్టన్ పోస్ట్’ ఫర్ సేల్.. నిజమెంత?

Washington Post:’వాషింగ్టన్ పోస్ట్’ ఫర్ సేల్.. నిజమెంత?

Washington Post:అమెరికాలో ఓ విషయంపై ప్రసిద్ధ వార్తా సంస్థల మధ్య జగడం ముదిరింది. వాషింగ్టన్ పోస్ట్ పత్రికకు యజమాని అయిన జెఫ్ బెజోస్… దాన్ని అమ్మేయాలని చూస్తున్నారని… న్యూయార్క్ పోస్ట్ ఓ వార్తా కథనం ప్రచురించడం కలకలం రేపింది. దీన్ని వాషింగ్టన్ పోస్ట్ అధికార ప్రతినిధులతో పాటు జెఫ్ బెజోస్ కూడా ఖండించారని… మరో వార్తా సంస్థ సీఎన్ఎన్ తెలిపింది.


అమెరికా రాజకీయాల్లో వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రికకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. దీని యజమాని అయిన జెఫ్‌ బెజోస్‌… ఓ ఫుట్‌బాల్‌ జట్టును కొనాలనుకుంటున్నారని, అందుకే పత్రికను అమ్మే ఆలోచన చేస్తున్నారని… విశ్వసనీయ వర్గాల పేరుతో న్యూయార్క్ పోస్ట్ కథనం రాసింది. ఫుట్‌బాల్‌ ఆటను ఎక్కువగా ఇష్టపడే జెఫ్ బెజోస్… ఓ జట్టును కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉన్నారని అందులో రాసుకొచ్చింది. దీనికి వాషింగ్టన్ పోస్ట్ ఎలాంటి కౌంటర్ ఇవ్వకపోయినా… మరో వార్తా సంస్థ సీఎన్ఎన్, న్యూయార్క్‌ పోస్ట్‌ ప్రచురించిన కథనంలో ఏ మాత్రం వాస్తవం లేదని రాసుకొచ్చింది.

ఇటీవల జెఫ్ బెజోస్ సీఎన్‌ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వూలో… వాషింగ్టన్‌ కమాండర్స్‌ అనే ఫుట్‌బాల్‌ జట్టును కొనాలనే ప్రయత్నాలు మాత్రం చేస్తున్నామని, పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఈ ఇంటర్వూకు ముందే… వాషింగ్టన్‌ కమాండర్స్‌ జట్టు యాజమాన్యంలో చాలా నిర్వహణ లోపాలు ఉన్నాయని… వాషింగ్టన్‌ పోస్ట్‌ పలు కథనాలు ప్రచురించింది. జట్టు యజమాని అయిన డ్యాన్‌ స్నైడర్‌పైనా అనేక ఆరోపణలు ఉన్నాయని రాసింది. ఇది జెఫ్‌ బెజోస్‌, స్నైడర్‌ మధ్య వ్యక్తిగత వివాదానికి దారితీసింది. వాషింగ్టన్‌ కమాండర్స్‌ను కొనాలనుకుంటున్న బెజోస్‌.. తమపై ఒత్తిడి పెంచి జట్టు


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×