Big Stories

Bad smell : ఇలా చేస్తే అరికాళ్ల నుంచి వచ్చే వాసన పోతుంది

Bad smell : ప్రతిరోజు షూస్‌ వేసుకునేవారు అప్పుడప్పుడు వాటి నుంచి వచ్చే దుర్వాసనను భరించలేకపోతుంటారు. సాక్స్‌లను శుభ్రం చేయకపోయినా, షూస్‌ను శుభ్రంగా ఉంచుకోకపోయినా విఫరీతమైన దుర్వాసన వస్తుంటుంది. ఒక్కోసారి శుభ్రంగా ఉంచుకున్నా బాక్టీరియా వల్ల పాదాల నుంచి దుర్వాసన వస్తుంది. చెమట ఎక్కువగా వచ్చి బాక్టీరియా పెరుగుతుంది. దీంతో పాదాల నుంచి దుర్వాసన వస్తుంది. షూస్‌ తీసిన తర్వాత కూడా ఆ వాసన అలాగే ఉంటుంది. కొన్ని సహజసిద్ధమైన చిట్కాలు పాటించడం వల్ల ఈ దుర్వాసనను తగ్గించుకోవచ్చు. బ్లాక్‌ టీలో ఉండే ట్యానిక్‌ యాసిడ్లు దుర్వాసనను కలిగించే బాక్టీరియాను నాశనం చేస్తాయి. అలాగే చెమట తక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో రెండు టీ బ్యాగ్స్‌ వేసి పావుగంట సేపు మరిగించాలి. తరువాత బ్యాగ్స్‌ తీసేసి అందులో మరింత నీటిని కలుపుకోవాలి. కాసేపు ఆ మిశ్రమాన్ని అలాగే ఉంచాలి. తర్వాత ఆ నీటిలో పాదాలను 30 నిమిషాల పాటు ఉంచాలి. దీంతో పాదాల నుంచి వచ్చే దుర్వాసన తగ్గుతుంది. బాక్టీరియా కూడా నశిస్తుంది. పాదాలపై కొన్ని చుక్కల లావెండర్‌ ఆయిల్‌ వేసి సున్నితంగా మర్దనా చేయాలి. రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే పాదాలపై ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది, దుర్వాసన కూడా తగ్గుతుంది. ఒక బకెట్‌ గోరు వెచ్చని నీటిలో అర కప్పు యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ వేసి బాగా కలపాలి. తర్వాత ఆ నీటిలో పాదాలను 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచాలి. దీంతో బ్యాక్టీరియా నశించి పాదాల నుంచి దుర్వాసన తగ్గుతుంది. షూస్‌ వేసుకునేటప్పుడు పాదాలపై కొద్దిగా మొక్కజొన్న పిండిని చల్లితే చెమట తక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఒకవేళ వచ్చినా చెమటను ఆ పిండి పీల్చుకుంటుంది. దీంతో పాదాలు పొడిగా ఉంటాయి. కొద్దిగా చక్కెర, పుదీనా ఆకులు, నీరు వేసి ఆ మిశ్రమాన్ని మిక్సీలో వేసి పేస్ట్‌లా తయారు చేయాలి. దాన్ని పాదాలకు రాయాలి. తర్వాత కడిగేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల చర్మం సంరక్షింపబడుతుంది. చర్మంపై ఉండే మృతకణాలు తొలగిపోతాయి. దీంతో చెమట తక్కువగా ఉత్పత్తి అవుతుంది. బకెట్‌ గోరు వెచ్చని నీటిలో రెండు కప్పుల ఎప్సమ్‌ సాల్ట్‌ కలిపి ఆ నీటిలో పాదాలను పావుగంట ఉంచాలి. కొబ్బరినూనెలో లారిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇది బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. పాదాల దుర్వాసనను తగ్గిస్తుంది. రోజూ పడుకునే ముందు కొబ్బరినూనెను పాదాలకు రాసుకుని మర్దనా చేస్తే దుర్వాసన పోతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News