Big Stories

WhatsApp Security Center: వాట్సాప్ ‘సెక్యూరిటీ సెంటర్’.. ప్రత్యేకంగా ఇండియన్ భాషల్లో..

WhatsApp Security Center : ప్రస్తుతం యూజర్ల ప్రైవసీని కాపాడే విషయంలో సోషల్ మీడియా యాప్స్‌కు విపరీతమైన ప్రెజర్ ఉంది. అందుకే రోజురోజుకీ ఎన్నో కొత్త ఫీచర్స్‌ను యాడ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాయి. అంతే కాకుండా సోషల్ మీడియా యాప్స్‌లో కూడా వాటి మధ్య వాటికే పోటీ ఉంటుంది. ఆ పోటీని దృష్టిలో పెట్టుకొని కూడా యాప్స్ అనేవి కొత్త ఫీచర్స్‌తో యూజర్లను ఆకర్షించాలని అనుకుంటాయి. వాట్సాప్ కూడా అందుకోసమే ప్రయత్నాలు చేస్తోంది.

- Advertisement -

ఒకప్పుడు వాట్సాప్ అనేది కేవలం ఒక మెసేజింగ్ యాప్‌గానే పరిచయం అయ్యింది. కానీ మెల్లగా ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడానికి.. ఆపై స్టేటస్, స్టోరీ అంటూ.. ఇలా ఎన్నో కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. గత కొంతకాలంగా వాట్సాప్ ప్రైవసీ విషయంలో యూజర్లకు అనుమానాలు ఎక్కువవ్వడంతో.. యాజమాన్యం ఆ కోణంపై దృష్టిపెట్టింది. ఇప్పటికే ప్రైవసీ విషయంలో రోజురోజుకీ ఎన్నెన్నో మార్పులు చేసుకుంటోంది ఈ మెసేజింగ్ యాప్. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను యాడ్ చేసింది.

- Advertisement -

‘సెక్యూరిటీ సెంటర్’ అనే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ ప్రవేశపెట్టింది. ఇది యూజర్లకు వాట్సాప్ వినియోగం విషయంలో ఒక గైడ్‌లాగా పనిచేస్తుంది. అవసరం లేని కాంటాక్ట్స్ నుండి, స్పామర్స్ నుండి తమను తాము ఎలా కాపాడుకోవాలని సెక్యూరిటీ సెంటర్ వారికి చెప్తుంది. ఇది వాట్సాప్ గురించి యూజర్లకు పూర్తిగా అవగాహన కల్పించడం కోసం, సేఫ్టీ గురించి వారికి మరింత స్పష్టంగా తెలియజేయడం కోసం ప్రవేశపెట్టిన ఫీచర్ అని యాజమాన్యం ప్రకటించింది.

ఇప్పటివరకు వాట్సాప్‌లో ఎలాంటి కొత్త ఫీచర్ ప్రవేశపెట్టినా.. అది ఇండియన్ భాషల్లో అందుబాటులో ఉండేది కాదు. కానీ మొదటిసారి సెక్యూరిటీ సెంటర్ అనేది 10 ఇండియన్ భాషల్లో అందుబాటులో ఉంటుందని యాజమాన్యం చెప్పింది. అవే హిందీ, పంజాబీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ, ఉర్దు, గుజరాతీ. ఇప్పటికే మెసేజ్‌లను ఎన్క్రిప్ట్ చేసే విధానం హ్యాకర్లకు చెక్ పెట్టిందని, ఇక సెక్యూరిటీ సెంటర్ కూడా యూజర్లకు మరిన్ని జాగ్రత్తలు చెప్తూ వారికి సెక్యూరిటీలాగా పనిచేస్తుందని తెలిపింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News