Big Stories

Kedarnath yatra :కేధార్ నాథ్ యాత్ర మళ్లీ ఎప్పుడు మొదలవుతుంది.

- Advertisement -

Kedarnath yatra :ఉత్తరాఖండ్ లో మంచు తుఫాన్లు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎక్కడికక్కడ విరిగిపడుతున్న మంచుకొండలు భక్తుల్ని ప్రమాదంలో పడేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మంచు తుఫాన్, ఇంకొన్ని చోట్ల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రోడ్లపై మూడు, నాలుగు అడుగుల మేర మంచు పేరుకుపోయింది. దీంతో కేధార్ నాథ్ యాత్రను నిలిపివేయక తప్పలేదు. 136 చోట్ల రోడ్లు మంచుతో కప్పబడిపోయాయి.

- Advertisement -

రోడ్లపై మంచుగడ్డలతో వాహనదారులకి యాత్రికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఉత్తరాకాశీ అంతా మంచుతో నిండిపోయింది. దీంతో ఎప్పటిలాగనే ఈసారి యాత్రకి ఆటంకాలు ఏర్పడాయి. కొన్ని రోజులపాటు కేధార్ నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు.మంచు తుఫాన్ల బీభత్సంతో ప్రభుత్వం అప్రమత్తమైన యాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది. కేదార్ నాథ్ వైపు రావద్దని ప్రభుత్వం హెచ్చరికలు ఇచ్చింది. తుఫాన్ల హెచ్చరికతో యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. తెహ్రీ, చమోలీ, డెహ్రాడూన్ లో, బాగే షేర్ లో, చంపావత్, ఆల్మోరా, నైనిటాన్, హరిద్వార్ ప్రాంతాలు అంతా మంచుమయంగా మారాయి.

అలకనంద, భగీరథీ, మందాకిని, గంగా నదులు గడ్డ కడుతున్నాయి. గంగోత్రి, కేదార్ నాథ్, బదిరీనాథ్ యమునోత్రి, చార్ ధామ్ యాత్రల మార్గాలు అన్ని మూసుకుపోయాయి. మే 10నాటికి లక్షా 26వేల మంది కేదార్ నాథ్ యాత్ర కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అలాగే ఇప్పటికే సుమారు లక్షా ఇరవై మూడు వేలమంది కేధార్ నాథ్ ను దర్శించుకుని తిరుగుముఖం కూడా పట్టారు

కేదార్ నాధ్ కు వెళ్లే మార్గంలో పరిస్థితి ఏమాత్రం బాగో లేదు. ఏక్షణాన మంచు కొండలు విరిగిపడతాయో చెప్పలేని భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాలినడకన వెళ్లే మార్గం కూడా ఏమంత సురక్షితంగా కనిపించడం లేదు. కంచరగాడిదల, గుర్రాలపై వెళ్లే మార్గంలోను మంచు వర్షం కురుస్తోంది. దీంతో యాత్రికులకు ఈ మార్గం కూడా మూసుకుపోయింది.

ఇప్పటి వరకు ప్రకృతి బీభత్సానికి 21మంది మృతి చెందినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యంగా 55 ఏళ్లు దాటిన వారు ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోలేక చనిపోతున్నారు. గుండె, శ్వాస సంబంధింత రోగాలతో బాధపడేవారు ఈయాత్రను విరమించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News