BigTV English

why we should not travel on Kanuma : కనుమనాడు ఎందుకు ప్రయాణం చేయకూడదంటే…

why we should not travel on Kanuma : కనుమనాడు ఎందుకు ప్రయాణం చేయకూడదంటే…

why we should not travel on Kanuma : హిందూమతంలో ఎన్నో సంప్రదాయాలు ఆచారాలున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి పండుగ సమయంలో చేసే ప్రయాణాల విషయంలో ఆలోచించమంటారు. ముఖ్యంగా పెద్ద పండుగ తర్వాత వచ్చే కనుమ రోజు ప్రయాణం తగదని ఆచారం చెబుతోంది. ఎందుకుంటే సంక్రాంతి మూడు రోజుల పండుగల కలయిక. భోగిరోజు తలంటి పిల్లలకు భోగిపళ్లు పోసి బొమ్మల పేరంటం పెట్టుకుని…సంక్రాంతి నోములు నోచుకుని పేరాంటాళ్లు, పసుపు కుంకమలు, పండు తాంబూలాలు ఇచ్చుకుంటూ అతిథులకు ఆహ్వానాలు పలుకుతూ ఎంతో ఉత్సాహంగా భోగిని జరుపుకుంటాం. శ్రీకృష్ణ భగవానుడు చిటికెన వేలుతో గోవర్ధనగిరిని ఎత్తి అందరూకాపాడిన రోజు కనుమ రోజేనని కొన్ని గ్రంధాలు చెబుతున్నాయి.


ఈ భూమ్మండలం మీద చెట్లు ఉండాలి, వర్షాలు కురవాలి, నేలంతా సస్యశ్యామలంగా కళకళలాడుతూ ఉండాలని చెప్పడానికి శ్రీకృష్ణుడు పర్వతాలు ఉండాలని బోధించాడు. అందుకు పర్వతాలను కాపాడుకోవాలని సందేశాన్ని గోవర్ధనగిరి ద్వారా చెప్పిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కనుమనాడే ప్రయాణం వద్దడానికి కారణం ఆవేళ మూడో రోజు అవుతుంది. భోగి , సంక్రాంతి , కనుమ. ఈ మూడో రోజు ప్రయాణం కూడదన్నారు. సంక్రాంతిని పిండి వంటలు, బాగా ఆరగించి ఉంటారు. బిడ్డ, అల్లుడు,మనువరాలుతో సంతోషంగా ఉన్న సమయంలో ప్రయాణం నింద్యము.

పుష్యమాసానికి శనీశ్వరుడు అధిపతి . పుష్యమి శనిసంబంధిత నక్షత్రం. ఈ నక్షత్రం మనలో కొంతమందకొడితనాన్ని ,బద్దకాన్ని, శారీరక అసౌకార్యాన్ని కలుగ చేస్తుంది. అందుకే నువ్వులు బియ్యం, నువ్వులు, బెల్లంతో చేసిన ఆహారం తినడం వల్ల శారీరక శుద్ది కలుగుతుంది. అందుకే అటువంటి పరిస్థితుల్లో ప్రయాణాలు చేయకూడదని శాస్త్రం చెబుతోంది. బియ్యం, నువ్వులు కలిపి అన్నంగా వండి పశుపక్ష్యాదులకు జీవజాలాలకు , కాకులకు పెట్టడం ద్వారా అవన్నీ యధేచ్చగా స్వీకరిస్తాయి. ప్రత్యక్షంగా కొన్ని అపశకునాలుగా కనిపించే వాతావరణాన్ని జీవ పర్యావరణాన్ని కాపాడుకోవడం అనే మార్గం ద్వారా ఎదురుకోవచ్చు. ఈ కారణాల వల్లే ప్రయాణాలు చేయకూడదు. కనుమ నాడు కాకైనా కదలదు అన్న సామెత పుట్టింది. కనుమనాడు ఇల్లు వదిలి వెళ్లొద్దని మామాగారు, బామ్మర్ది గడ్డం పుచ్చుకుని బతిమాలితే ఏ అల్లుడైనా ఇలు వదిలి వెళ్తాడా…కనుమ రోజు ఈశ్వరుడ్ని అర్చించాలి. ఇంటిల్లిపాది ఆనందంగా ఉండాలి.


For more updates follow this link :- Bigtv

Tags

Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×