BigTV English

Barbie Doll : అమ్మాయి వింత కోరిక.. బార్బీలాగా మారడం కోసం రూ.80 లక్షల ఖర్చు..

Barbie Doll : అమ్మాయి వింత కోరిక.. బార్బీలాగా మారడం కోసం రూ.80 లక్షల ఖర్చు..

Barbie Doll : బార్బీ బొమ్మలు చూడడానికి ఎంత ముద్దుగా ఉంటాయో కదా.. ఇప్పుడంటే ఎక్కువగా కనిపించడం లేదు కానీ ఒకప్పుడు ఈ బొమ్మలకు ఉన్న క్రేజే వేరే. చాలా అందంగా, ముద్దుగా ఉన్న అమ్మాయిలను పొగడాలి అనుకున్నా కూడా బార్బీ బొమ్మ లాగా ఉన్నావు అనేవారు. అలా ఒక అమ్మాయికి బార్బీ బొమ్మల మీద ఉన్న ఇష్టం.. తనే ఒక బార్బీలాగా మారేలా చేసింది. అది ఎలా అనుకుంటున్నారా..? ప్లాస్టిక్ సర్జరీతో. దానికోసం ఆమె పెట్టిన ఖర్చు చూసి విన్నవారు సైతం ఆశ్చర్యపోతున్నారు.


ఈరోజుల్లో మనుషుల్లో పెరిగిపోతున్న ఫ్యాంటసీల కారణంగా వారు ఏమేమి చేయడానికి సిద్ధపడుతున్నారో అసలు ఊహకే అందడం లేదు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో నివసించే జాజ్మిన్ ఫారెస్ట్‌‌కు ఇలాంటి ఒక వింత ఫ్యాంటసీ ఉండేది. అదే బార్బీ బొమ్మలాగా కనిపించడం. దానికోసం ఆమె ఏకంగా 1 లక్ష డాలర్లను ఖర్చు పెట్టింది. అంటే దాదాపు రూ.82.81 లక్షలు. అంత కాస్ట్‌లీ ప్లాస్టిక్ సర్జరీ తర్వాత తను జాజ్మిన్ ఏకంగా ‘రియల్ లైఫ్ బార్బీ ప్రిన్సెస్’లాగా మారిపోయింది. ఈ సర్జరీ వల్ల తన జీవితం పూర్తిగా మారిపోయిందని జాజ్మిన్ అంటోంది.

ముందుగా జాజ్మిన్ 18 ఏళ్లు ఉండగా.. బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ సర్జరీను చేయించుకుంది. గతేడాది మరో రొమ్ముకు కూడా ఆ సర్జరీని చేయించింది. అలా బార్బీ బొమ్మలాగా కనిపించడం కోసం తను ఎన్నో సర్జరీలకు సిద్ధపడింది. సర్జరీ తర్వాతే తను చాలా అందంగా ఉందని చాలామంది చెప్పారని జాజ్మిన్ సంతోషం వ్యక్తం చేస్తోంది. తనకు జరిగిన సర్జరీల గురించి, బార్బీ బొమ్మలాగా కనిపించాలి అనే ఫ్యాంటసీ గురించి జాజ్మిన్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా బయటపెట్టింది.


‘నేను టీనేజ్‌లో ఉన్నప్పుడే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాను. అప్పటినుండే నా శరీరంలో మార్పులు జరగాలని నాకు అర్థమయ్యింది. సర్జరీ తర్వాత ఆడవారు, మగవారు అందరూ నన్ను ట్రీట్ చేస్తున్న పద్ధతి చూసి నా ఆత్మస్థైర్యం కూడా చాలా పెరిగింది. నేను రోజుకు రెండుసార్లు నా బాడీని, నా మొహాన్ని అద్దంలో చూసుకుంటాను. అది నా ఆత్మస్థైర్యాన్ని పెంచడంతో పాటు నా మొహాన్ని, శరీరాన్ని మార్చుకోవడానికి నేను చేసిన ఖర్చు వృథాగా పోలేదని నాకు గుర్తు చేస్తుంటుంది.’

‘స్నేహితులుగా ఉండాలన్నా, ప్రేమలో పడాలన్నా హాట్‌గా ఉంటేనే మనుషులు దగ్గరవుతారు’ అని అందానికి కొత్త అర్థాన్ని చెప్తోంది జాజ్మిన్. తను 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు బ్రెస్ట్ ఆగ్మెంటేషన్‌తో పాటు లిప్ ఫిల్లర్స్‌ను కూడా చేయించుకుంది. దాంతో పాటు మొహంలో ఎన్నో మార్పులను చేయించుకుంది. ఈ సర్జరీలతో పాటు బొటాక్స్ ఇన్‌జెక్షన్స్‌ను కూడా తను రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉండేది. పొట్ట దగ్గర నుండి కాళ్ల వరకు జాజ్మిన్ శరరీంలోని ప్రతీ భాగానికి సర్జరీ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అమ్మాయిలు ఇలాంటి బార్బీ లుక్స్ కోసం సర్జరీ చేయించుకున్నారు, జాజ్మిన్ చేసిన పని కొత్తేమి కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Related News

Bigg Boss Telugu 9: దివ్య వైల్డ్ ఎంట్రీ.. వచ్చిరాగానే లవ్ బర్ట్స్ బండారం బట్టబయలు.. రీతూ పరువు మొత్తం పాయే!

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Railway Jobs: ఇండియన్ రైల్వేలో 3115 అప్రెంటీస్ ఉద్యోగాలు.. సింపుల్ ప్రాసెస్, అప్లై చేస్తే మీదే ఉద్యోగం

Big Stories

×