BigTV English

Zomato & Blink take AI help : ఏఐ సాయం తీసుకోనున్న జొమాటో, బ్లింక్ ఇట్..

Zomato & Blink take AI help : ఏఐ సాయం తీసుకోనున్న జొమాటో, బ్లింక్ ఇట్..


Zomato & Blink take AI help : ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) అనేది టెక్ ప్రపంచంలో ఒక భాగమయిపోయింది. ఇంకా కొన్నిరోజులు గడిస్తే.. అసలు ఏఐ లేకుండా ఉండే జీవితాన్ని, టెక్ ప్రపంచాన్ని మనం చూడలేమేమో అనిపిస్తోంది. ఇప్పటికే చాలావరకు టెక్ సంస్థలు.. ఏఐ మీద ఆధారపడ్డాయి. ఏఐ సాయం లేకుండా బిజినెస్ ముందుకు వెళ్లదేమో అనే పరిస్థితి ఏర్పడింది. అందుకే యాప్స్ కూడా ఇప్పుడు బిజినెస్‌ను మెరుగుపరచుకోవడానికి ఏఐ సాయం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

గూగుల్ నుండి మైక్రోసాఫ్ట్ వరకు.. ఎన్నో దిగ్గజ టెక్ సంస్థలు.. ఇప్పుడు ఏఐపై పూర్తిగా ఆధారపడ్డాయి అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. అంతే కాకుండా యూజర్లను ఆకర్షించడం కోసం కొత్త కొత్త ఏఐ టూల్స్‌ను కూడా తయారు చేయడంలో బిజీగా ఉన్నాయి. ముఖ్యంగా ఓపెన్ఏఐ సాయంతో మార్కెట్లోకి వచ్చిన చాట్‌జీపీటీ.. ఏఐను మరింత ట్రెండ్‌లోకి తీసుకొచ్చింది. బింగ్, బార్డ్ లాంటివి కూడా ఇప్పుడు చాట్‌జీపీటీ లాగానే వైరల్ అవుతున్నాయి. ఇంతలోనే సోషల్ మీడియాలో యాప్స్ కూడా ఏఐ సామర్థ్యాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నాయి.


ఇప్పటికే స్నాప్‌చాట్, మింత్రా లాంటి యాప్స్.. తమ యూజర్లను ఆకర్షించడం కోసం ఏఐ సాయాన్ని తీసుకుంటున్నాయి. ప్రస్తుతం జొమాటో కూడా వీటిని ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తన సర్వీసులను ఏఐ సాయంతో ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటోంది. ఇప్పటికే జొమాటో.. ఏఐను తమ సర్వీసులలో ఎలా భాగం చేసుకోవాలి అనే విషయంపై టెస్టింగ్‌ను ప్రారంభించిందని సమాచారం. జొమాటోతో పాటు హోమ్ డెలివరీ సర్వీస్ యాప్ బ్లింక్ ఇట్ కూడా ఏఐను కూడా ఉపయోగించాలని నిర్ణయించుకుంది.

ఇప్పటికే జొమాటో.. ఏఐ ప్రొడక్ట్ డెవలప్మెంట్ కోసం ఉద్యోగులను నియమించుకున్నట్టు తెలుస్తోంది. సెర్చ్ విషయంలో, నోటిఫికేషన్స్ అందించే విషయంలో, కస్టమర్ సపోర్ట్, సర్వీసుల విషయంలో ఏఐను ఉపయోగించుకోవాలని జొమాటో సన్నాహాలు చేస్తోంది. జొమాటో, బ్లింక్ ఇట్ కలిసి ఈ ఏఐ టూల్స్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు సమాచారం. జొమాటో అనేది ఇప్పటికే చాలా మెరుగ్గా కస్టమర్లను ఆకర్షిస్తూ ముందుకు వెళ్తున్నప్పటికీ ఏఐ అనేది దీనికి మరింత బూస్ట్‌ను అందిస్తుందని యాజమాన్యం బయటపెట్టింది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×