BigTV English

Benefits Of Walking: తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏం జరుగుతుందో తెలుసా ?

Benefits Of Walking: తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏం జరుగుతుందో తెలుసా ?

Benefits Of Walking After Meals: ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది ఉద్యోగం, వ్యాపార బిజీలో పడి ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పని ఒత్తిడి, మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఆరోగ్యంపై చాలా ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. భోజనం తర్వాత కనీసం 10 నిమిషాల పాటు వాకింగ్ చేయాలని దీని వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


జీర్ణక్రియ మెరుగుపడుతుంది:
భోజనం చేసాక నడిస్తే జీర్ణక్రియ ఎంతో మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. తిన్నాక నడవడం వల్ల పేగుల్లో కదలికలు చక్కగా జరిగి జీర్ణక్రియ వేగవంతం అవుతుందని అంటున్నారు. ఫలితంగా ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అంతే కాకుండా ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది:
తిన్న తర్వాత నడవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను ఇది అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
బరువు తగ్గడానికి:
భోజనం తర్వాత నడక బరువు తగ్గడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. తిన్న తర్వాత నడవడం వల్ల ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయని అంటున్నారు. ఇది వేడిని అదుపులో ఉంచుతుంది. సాధారణ వ్యయామం కూడా శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది.
గుండె ఆరోగ్యానికి:
తిన్న తర్వాత నడక రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది గుండెను బలపరచడమే కాకుండా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
ఒత్తిడిని తగ్గిస్తుంది:
సాధారణ వ్యాయామం ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరచడంలో పాటు ఒత్తిడిని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా తిన్న తర్వాత నడవడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుందని అంటున్నారు.

Also Read: కూరగాయలు త్వరగా పాడవుతున్నాయా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి


నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది:
భోజనం తర్వాత చేసే సాధారణ వ్యాయామం సిర్కాడియన్ రిథమ్‌ను నియంత్రించడం ద్వారా మంచిగా నిద్రపడుతుంది. మెరుగైన జీర్ణక్రియనకు పోత్సహించడంతో పాటు ప్రశాంతమైన నిద్రకు దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే తిన్న తర్వాత నడక కండరాలు, కీళ్లను బలపరచడంతో చాలా బాగా సహాయపడుతుందని అంటున్నారు.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×