BigTV English

Anti Valentine Week : యాంటీ వాలెంటైన్ వీక్.. చెంప పగలగొట్టొచ్చు..!

Anti Valentine Week : యాంటీ వాలెంటైన్ వీక్.. చెంప పగలగొట్టొచ్చు..!

Anti Valentine Week : పిభ్రవరి వచ్చిందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులంతా కొత్త లోకంలో విహరిస్తున్న అనుభూతిని పొందుతారు. వాలెంటైన్స్ డే కు వారం రోజులు ముందుగానే వాలెంటైన్ వీక్ పేరుతో ఫిబ్రవరి 14 వరకు సెలబ్రేషన్స్ స్టార్టై పోతాయి. మనసుకు నచ్చిన వారికి గిఫ్గ్‌లు ఇస్తూ.. సర్ ప్రైజ్ చేస్తూ ఉంటారు. తమ ప్రియమైన వారికి మరింత దగ్గరయ్యేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.


ఇదిలా ఉండగా ప్రేమికుల కోసం మాత్రమే కాదు.. బ్రేకప్ చేసుకున్న వారికి కూడా యాంటీ వాలెంటైన్ వీక్ అనేది ఒకటుందట. మీకు ఇది వినడానికి వింతగా ఉన్నా.. వాస్తవమే. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే ముగిసిన తర్వాత రోజు నుంచి యాంటీ వాలెంటైన్స్ వీక్ ప్రారంభమవుతుంది.

ఇదంతా ప్రేమికులకు వ్యతిరేకం ఏమి కాదు. బ్రేకప్ పేరిట విడిపోయిన వారు సరదాగా గడిపేందుకు మాత్రమే. వారు కొత్త జీవితాన్ని సంతోషంగా ప్రారంభించాలనేది దీని ఉద్దేశం. యాంటీ వాలెంటైన్స్ డే ఫిబ్రవరి 15 నుంచి 21 వరకు జరుపుకుంటారు. ఈ వాలెంటైన్ వీక్‌లో ఉన్న ఏడు రోజులకు ఎటువంటి ప్రాధాన్యత ఉందో తెలుసుకుందాం.


యాంటీ వాలెంటైన్ వీక్ తేదీలు

  • ఫిబ్రవరి 15 – స్లాప్ డే(Slap Day)
  • ఫిబ్రవరి 16 – కిక్ డే(Kick Day)
  • ఫిబ్రవరి 18 – ఫ్లర్ట్ డే(Flirt Day)
  • ఫిబ్రవరి 17 – పెర్ఫ్యూమ్ డే(Perfume Day)
  • ఫిబ్రవరి 19 – కన్ఫెషన్ డే(Confession Day)
  • ఫిబ్రవరి 20 – మిస్సింగ్ డే(Missing Day)
  • ఫిబ్రవరి 21 – బ్రేకప్ డే(Breakup Day)

స్లాప్ డే
యాంటీ వాలెంటైన్ వీక్‌లో తొలి రోజున స్లాప్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. దీని అర్థం మీరిద్దరూ ఘర్షణ పడాలని కాదు. మిమ్మల్ని బాధపెట్టిన వారి పట్ల మీకున్న భావాలను విడిచిపెట్టి చెడు ఆలోచనలను, జ్ఞాపకాలకు దూరంగా ఉండాలి. అవసరమైతే మిమ్మల్ని బాధపెట్టిన వారి చెంపపగలగొట్టే రోజే స్లాప్ డే.

కిక్ డే
యాంటీ వాలెంటైన్ వీక్‌లో రెండో రోజు కిక్ డే జరుపుకుంటారు. దీనికి ఓ స్పెషాలిటీ ఉంది. ఈ రోజున మీ బాధలన్నింటినీ దూరంగా పెట్టండి. మిమ్మల్ని ఎవరైనా ప్రేమలో మోసం చేస్తే వారి జ్ఞాపకాలను వదిలేయండి.

పర్ఫ్యూమ్ డే
యాంటీ వాలైంటైన్ వీక్‌లో మూడో రోజున పర్ఫ్యూమ్ డే జరుపుకుంటారు. ఈ రోజున మీమ్మల్ని వెంటాడుతున్న చేదు జ్ఞాపకాలను వదిలించుకోండి. మంచి సువాసన ఇచ్చే పరిమళాన్ని మీ శరీరానికి పూసుకుంటే.. ఆ వాసన మీ మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది.

ఫ్లర్ట్ డే
యాంటీ వాలెంటైన్ వీక్‌లో నాలుగో రోజును ఫ్లర్ట్ డేగా జరుపుకుంటారు. మీ భాగస్వామితో విడినపోయిన తర్వాత కొత్త లైఫ్‌కి వెల్‌కమ్ చెబుతూ ఈ ఫ్లర్ట్‌డే సెలబ్రేట్ చేసుకుంటారు. కొత్త వ్యక్తిని కలుసుకుని వారితో ఈరోజు సరదాగా గడపండి.

కన్ఫెషన్ డే
యాంటీ వాలెంటైన్ వీక్‌లో ఐదో రోజున కన్ఫెషన్ డేను జరుపుకుంటారు. మీరు ఇప్పటి వరకు రిలేషన్‌షిప్‌లో పడిన కష్టాలను ఈరోజున పూర్తిగా మరిచిపోవాలి. మీ తప్పులను ఒప్పుకోని కొత్త జీవితాన్ని ప్రారంభించండి.

మిస్సింగ్ డే
యాంటీ వాలెంటైన్ వీక్‌లో ఆరో రోజును మిస్సింగ్ డేగా జరుపుకుంటారు. ప్రేమించిన భాగస్వామి గడిపిన అద్భుతమైన క్షణాలను మిస్ అవుతుంటాము. వారి జ్ఞాపకాలకు గుర్తుగా ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటాము.

బ్రేకప్ డే
యాంటీ వాలెంటైన్ వీక్‌లో చివరి రోజైన ఏడో రోజు బ్రేకప్ డే జరుపుకుంటాము. ఈ రోజు చాలా ముఖ్యమైనది. ఈ రోజున మీరు ప్రేమించిన వ్యక్తి ప్రేమ నిజమైనది కాకపోతే బ్రేకప్ చెప్పండి. ఆనందంగా జీవించండి.

Tags

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×