Indian Snacks: స్నాక్స్ తినడం ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ప్రజలు తమ అభిరుచులకు అనుగుణంగా వేర్వేరుగా తినడానికి ఎంచుకుంటారు. భోజనం, రాత్రి భోజనం, టిఫిన్‌తో పాటు, ఆకలిగా ఉన్నప్పుడు స్నాక్స్ తినే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇదిలా ఉంటే చాలా మంది స్నాక్స్ బయట కొనుక్కుని తింటారు. కానీ వీటి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ఇదిలా ఉంటే.. ఆకలి తీర్చుకోవడానికి తినే చిరు తిళ్లు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. ఇది మన గుండెపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అందుకే.. రుచితో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఆకలి తీర్చుకోవడానికి.. మీరు మీ ఆహారంలో కొన్ని రకాల ఆరోగ్య కరమైన చిరు తిళ్లను చేర్చుకోవచ్చు. ఎలాంటి భయం లేకుండా ఆస్వాదించగలిగే.. కొన్ని స్నాక్స్ కూడా ఉన్నాయి.
ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా.. శరీరంలో మీ కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగకుండా కూడా నిరోధిస్తాయి.
మొలకెత్తిన విత్తనాలు:
మొలకెత్తిన విత్తనాలు ఆరోగ్య కరమైన, రుచి కరమైన స్నాక్స్. అంతే కాకుండా వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. మొలకెత్తిన విత్తనాలతో పచ్చి కూరగాయలు ముక్కలుగా చేసి తినడం ద్వారా కూడా మంచి ఫలితం ఉంటుంది.
భేల్ పూరి:
భేల్ పూరి మీ ఆకలిని తీర్చుకోవడానికి ఒక సరళమైన, రుచికరమైన మార్గం. పఫ్డ్ రైస్‌తో తయారు చేసిన భేల్ పూరీ కూడా చాలా ఆరోగ్యకరమైంది. చింతపండు చట్నీ, మసాలాలు, కూరగాయలు దీని రుచిని మరింత పెంచుతాయి.
చనా చాట్:
కొంచెం ఆకలిగా అనిపిస్తే.. మీరు చనా చాట్ ప్రయత్నించవచ్చు. ఈ ప్రోటీన్ అధికంగా ఉండే కాల్చిన శనగలు మీ కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగకుండా ఉండటానికి సహాయపడుతుంది. అంతే కాకుండా మీరు దీన్ని త్వరగా తయారు చేసుకుని ఎప్పుడైనా తినొచ్చు.
Also Read: కొలెస్ట్రాల్ వేగంగా పెంచే ఆహారాలివే.. దూరంగా ఉండకపోతే కష్టమే !
రాగి చిప్స్:
మీరు చిప్స్ ప్రియులైతే.. రాగి చిప్స్ ఆరోగ్య కరమైన ఎంపిక కావచ్చు. ఇవి క్రంచీగా.. పోషకాలతో కూడుకుని ఉంటాయి. అంతే కాకుండా ఇవి మీ గుండె ఆరోగ్యానికి గొప్ప ప్రయోజనాలను కలిగి ఉంటాయి.
ఖమాన్ ధోక్లా:
ఖమన్ ధోక్లా చాలా మందికి ఇష్ట మైన చిరు తిండి. ఈ శనగ పిండితో తయారు చేసే స్నాక్స్‌ను ప్రధానంగా గుజరాత్‌లో తింటారు. కానీ దీని రుచి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దీనిలో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి.
మూంగ్ దాల్ :
మీరు ఆరోగ్య కరమైన స్నాక్ కోసం చూస్తున్నట్లయితే.. మూంగ్ దాల్ ఒక గొప్ప ఎంపిక. మూంగ్ దాల్‌ను నాన బెట్టి మెత్తగా పేస్ట్ చేయడం ద్వారా దీనిని తయారు చేస్తారు. ఇది రుచి కరంగా ఉండటమే కాకుండా.. ఇందులో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ స్నాక్స్‌లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. దీనిని ఉదయం లేదా సాయంత్రం ఏ సమయం లోనైనా తినవచ్చు.