Instant Skin Glowing: ఈ రోజుల్లో చాలా మంది అనేక చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ముఖంపై మొటిమలు, మచ్చలు, ముఖం జిడ్డుగా మారడం వంటి సమస్యతో సతమతమవుతున్నారు. ఇందుకోసం మార్కెట్లో వివిధ రకాల క్రీములు ఉపయోగిస్తున్నారు. కానీ ఇవి టెంపరరీగా పనిచేస్తాయి కానీ.. శాశ్వతంగా ఉండదు. మళ్లీ యదావిథిగా ముఖంపై వచ్చేస్తుంటాయి. ఈ సమస్యలన్నింటిని తొలగించేందుకు మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే డ్రాగన్ ఫ్రూట్.. చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో విటమిన్ సి, బీటాలైన్లు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఇవి ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గించేందుకు, అలాగే వృద్ధాప్య సమస్యల నుండి దూరం చేసేందుకు ఉపయోగపడతాయి. ఆలస్యం చేయకుండా డ్రాగన్ ఫ్రూట్ తో ఫేస్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
డ్రాగన్ ఫ్రూట్, శెనగపిండి ఫేస్ మాస్క్
డ్రాగన్ ఫ్రూట్ ముక్కలను మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని.. చిన్న గిన్నెలోకి తీసుకోవాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ శెనగపిండి వేసి బాగా కలిపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం ద్వారా ముఖంపై మొటిమలు, మచ్చలు తొలగిపోయి కాంతి వంతంగా మెరుస్తుంది. ఇలా వారానికి రెండు సార్లు చేయడం ద్వారా మంచి రిజల్ట్ మీకు కనిపిస్తాయి.
డ్రాగన్ ఫ్రూట్, పాలు, తేనె ఫేస్ ప్యాక్
డ్రాగన్ ఫ్రూట్‌ను మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని.. అందులో రెండు టేబుల్ స్పూన్ పాలు, తేనె కలిపి ముఖానికి అప్లై చేయండి. అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం ద్వారా ముఖంపై మచ్చలు, జిడ్డును తొలగించి కాంతివంతంగా, మెరిసేలా చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తే.. మంచి ఫలితం ఉంటుంది.
డ్రాగన్ ఫ్రూట్, రోజ్ వాటర్, ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్
డ్రాగన్ ఫ్రూట్ తొక్కలను, అలాగే లోపల గుజ్జును మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని.. అందులో రెండు టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, రెండు టేబుల్ స్పూన్ ముల్తానీ మిట్టి కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది. ముఖంపై మచ్చలు, మొటిమలు, ముడతలు తగ్గిపోయి కాంతివంతంగా, మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.
Also Read: కొలెస్ట్రాల్ వేగంగా పెంచే ఆహారాలివే.. దూరంగా ఉండకపోతే కష్టమే !
డ్రాగన్ ఫ్రూట్, బియ్యంపిండి ఫేస్ ప్యాక్
డ్రాగన్ ఫ్రూట్ చర్మాన్ని హైడ్రేట్‌గా, తేమగా ఉంచడంలో అద్బుతంగా పనిచేస్తుంది. ఇందుకోసం డ్రాగన్ ఫ్రూట్ ముక్కలను మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ బియ్యంపిండి, పాలు కలిపి ముఖానికి అప్లై చేయండి. అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ముఖం కాంతివంతంగా, అందంగా ఉండేలా చేస్తుంది.