BigTV English

Quiet Love: ఏ వ్యక్తి అయినా మిమ్మల్ని నిశ్శబ్దంగా ప్రేమిస్తే అతడిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి

Quiet Love: ఏ వ్యక్తి అయినా మిమ్మల్ని నిశ్శబ్దంగా ప్రేమిస్తే అతడిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి

Quiet Love: కొంతమంది నిశ్శబ్దంగా ప్రేమిస్తారు. బయటికి చెప్పుకోరు, అలా వారి ప్రేమ సంవత్సరాలు గడిచిపోతుంది. ఆ ప్రేమను కూడా గుర్తించాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. ప్రపంచంలో నిశ్శబ్ద ప్రేమను ఫాలో అయ్యే వారి సంఖ్య ఎక్కువే. వీరిది చాలా ప్రశాంతమైన, వినయ పూర్వకమైన, స్థిరమైన సంబంధం అని చెప్పుకోవచ్చు.


ప్రేమ ఎవరి మీద ఎప్పుడు పుడుతుందో చెప్పడం చాలా కష్టం. మీ భాగస్వామితో మీరు శాంతియుత బంధాన్ని పంచుకోవాలనుకుంటే తక్కువగా మాట్లాడడం, ప్రశాంతంగా ఉండడం ఎంతో ముఖ్యం. భావోద్వేగ సంబంధాలను కలిగి ఉండడం ముఖ్యమే అయినా వాటిని అతిగా ప్రదర్శించరాదు. అలా ప్రదర్శించని ప్రేమ యుగాలపాటు సాగుతుంది. ఏ వ్యక్తి అయినా మిమ్మల్ని నిశ్శబ్దంగా ప్రేమిస్తున్నా మీరు అతను చేసే పనుల ద్వారా ఆ విషయాన్ని గమనించవచ్చు.

నిశ్శబ్ద ప్రేమలో భావోద్వేగాలే చాలా ముఖ్యం. దీనికి మాటలు, పాటలు అవసరం లేదు. అంతర్ముఖులే ఇలా నిశ్శబ్దంగా ప్రేమిస్తూ ఉంటారు. వారి మాటల కన్నా పనులే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మిమ్మల్ని నిశ్శబ్దంగా ప్రేమిస్తున్న వ్యక్తి మీకు తన మనసులో మాటను చెప్పడానికి చిన్నచిన్న కాగితాలపై ఏమైనా రాసి పెడుతూ ఉంటారు. అలాగే మీకోసం ఏమైనా తినే పదార్థాలను మీరున్నచోట పెట్టి మాయమైపోతారు.


మీరు విజయం సాధిస్తే వారే విజయం సాధించినంతగా ఆనందపడతారు. నిశ్శబ్ద ప్రేమికులు మీ విజయానికి వారే కారణం కూడా కావచ్చు, మీరు జీవితంలో రాణించాలని ఎంతో కోరుకుంటారు. ఇలాంటి నిశ్శబ్ద ప్రేమికులను కచ్చితంగా గుర్తించి వారి ప్రేమను అంగీకరిస్తే మీ జీవితం కూడా ఎంతో అందంగా ఉంటుంది.

ఇక పెళ్లి చేసుకున్న భార్య లేదా భర్త నిశ్శబ్ద ప్రేమికులైతే వారు మీతో తమ ప్రేమను నోటి ద్వారా చెప్పలేరు. చిన్న చిన్న పనుల ద్వారా ఎక్స్‌ప్రెస్ చేస్తారు. వారి జీవితంలో ఎంత బిజీగా ఉన్నా మీ కోసం ఎంతో కొంత సమయాన్ని వెచ్చించడానికి ప్రాధాన్యత ఇస్తారు. మీతో కలిసి సినిమా చూసేందుకు, కాసేపు నడిచేందుకు, లాంగ్ డ్రైవ్ వచ్చేందుకు, చిన్నచిన్న వంటలు చేసేందుకు మీతో సరదాగా ఒక అరగంటసేపు గడిపేందుకు ప్రయత్నిస్తారు. అలా ప్రయత్నిస్తే మీ భర్త లేదా భార్య మిమ్మల్ని ఎంతో ఇష్టపడుతున్నట్టు అర్థం.

మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి నిశ్శబ్దంగానే మీతో ఆనందాన్ని పంచుకోవడానికి ప్రయత్నిస్తారు. మీతో కలిసి సూర్యాస్తమయాన్ని చూసేందుకు, సంగీతాన్ని వినేందుకు, కలిసి పుస్తకాలు చదివేందుకు, భోజనం చేసేందుకు ఇష్టపడతారు. ఆ సమయంలో కూడా వారు నిశ్శబ్దంగానే ఉంటారు. ఆ నిశ్శబ్ధ క్షణాలను ఆస్వాదించడం మీరు కూడా అలవాటు చేసుకోవాలి.

Also Read: ఏవండోయ్ ఈ విషయం విన్నారా? అలారంతో హై బీపీ వస్తుందట, జాగ్రత్త పడండి

నిశ్శబ్ద ప్రేమికుల్లో నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అధికంగా ఉంటుంది. మీ కంట్లోకి నేరుగా చూడడం, గట్టిగా కౌగిలించుకోవడం, నుదుటిపై లేదా చెంపపై ముద్దులు పెట్టడం, చేతులు పదే పదే పట్టుకోవడం వంటివి వారి నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. ఇది వారి భావోద్వేగాలను వ్యక్తీకరించే పద్ధతి. మీకు వెచ్చదనాన్ని, ప్రశాంతతను ఇచ్చేందుకు వారు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారని చెప్పడమే. ఇలాంటి నిశ్శబ్ద ప్రేమ మీ జీవితంలో ఉంటే మీరు ఎంతో అదృష్టవంతులని చెప్పుకోవాలి.

Related News

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Big Stories

×