Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ రియాలిటీ షోలో ప్రతీవారం కామన్‌గా జరిగే విషయం నామినేషన్స్. ఇందులో ఒక కంటెస్టెంట్ వచ్చి తనకు నచ్చని ఇద్దరు కంటెస్టెంట్స్‌ను నామినేట్ చేయాలి. అప్పుడప్పుడు చీఫ్ వల్ల ఈ నామినేషన్స్ నుండి కొందరు సేవ్ అవుతారు కూడా. కానీ బిగ్ బాస్ హిస్టరీలో ఈసారి నామినేషన్స్ కాస్త డిఫరెంట్‌గా జరిగాయి. బిగ్ బాస్ 8లో మొదటిసారిగా విష్ణుప్రియా మెగా చీఫ్ అయ్యింది. మెగా చీఫ్ అయిన వెంటనే నామినేషన్స్ విషయంలో విష్ణుకు పెద్ద బాధ్యతే అప్పగించారు బిగ్ బాస్. ఒకేసారి అయిగురిని నామినేట్ చేయమన్నారు. దీంతో తను నబీల్, ప్రేరణ, టేస్టీ తేజ, గౌతమ్, నయని పావని నామినేట్ చేసింది. అక్కడే మరో లెవెల్ మొదలయ్యింది.
నబీల్ సేఫ్
అయిదుగురు కంటెస్టెంట్స్‌ను నామినేట్ చేసి వారిని జైలులో పెట్టింది విష్ణుప్రియా. అప్పుడే బిగ్ బాస్ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. గార్డెన్ ఏరియాలోని సోఫాపై జైలుకు సంబంధించిన తాళంచెవిని పెట్టి బజర్ రాగానే ముందుగా అది ఎవరు అందుకుంటే వారు నామినేట్ అయినవారిని సేవ్ చేసి మరొకరిని నామినేట్ చేయవచ్చని తెలిపారు. దీంతో ముందుగా ఆ తాళంచెవిని దక్కించుకున్న పృథ్వి.. నబీల్‌ను సేవ్ చేసి అవినాష్‌ను నామినేట్ చేశాడు. అసలు నామినేషన్స్‌లో తన టీమ్‌కు సంబంధించిన సభ్యులు ఎవరూ ఉండకూడని పృథ్వి గట్టిగా ఫిక్స్ అయ్యాడు. అవినాష్ ఆటలో ఉంటే వేగంగా వెళ్లి తాళంచెవిని అందుకుంటాడేమో అని తనను నామినేట్ చేశాడు.
Also Read: మెహబూబ్ 3 వారాలకు ఎంత సంపాదించాడో తెలుసా?
రోహిణి సాధించింది
నబీల్, యష్మీ కలిసి ఒక స్ట్రాటజీని ఉపయోగించి తాళంచెవి యష్మీ చేతిలో పడేలా చేశారు. దీంతో తను ప్రేరణు సేవ్ చేసి హరితేజను నామినేట్ చేసింది. ఒకప్పుడు తనలో ఫైర్ ఉండేదని, మెల్లగా అది తగ్గిపోయిందని కారణం చెప్పింది. తన పాప గుర్తురావడం వల్లే తను అలా బాధపడుతున్నానని బయటపెట్టింది హరితేజ. ఇప్పుడు రాయల్స్ టీమ్ నుండి తాళంచెవి అందుకోవడానికి రోహిణి మాత్రమే మిగిలింది. ఫైనల్‌గా తనే తాళంచెవి అందుకోగలిగింది. వెంటనే అవినాష్‌ను సేవ్ చేసి పృథ్విని నామినేట్ చేసింది. పృథ్వి కొన్నిసార్లు కోపంలో ఏం చేస్తున్నాడో తెలియడం లేదని కారణం చెప్పింది. అవినాష్‌కు ఆరోగ్య సమస్యలు ఉన్నా తనవల్ల అయినంత చేస్తున్నాడని చెప్పి తనను సేవ్ చేసింది.
గతిలేక చేస్తున్నా
అవినాష్ సేవ్ అయ్యి రంగంలోకి దిగాడు కాబట్టి ఈసారి తనకే తాళంచెవి దొరికింది. తను టేస్టీ తేజను సేవ్ చేసి యష్మీని నామినేట్ చేశాడు. ఫైనల్ రౌండ్‌లో ప్రేరణ తాళంచెవి దక్కించుకుంది. తను వెంటనే టేస్టీ తజను నామినేట్ చేసి పృథ్విని సేవ్ చేసింది. టేస్టీ తేజను నామినేట్ చేయడానికి తన దగ్గర కారణాలు లేవని, ఇదంతా గతిలేక తన టీమ్ కోసమే చేస్తున్నానని సిగ్గులేకుండా చెప్పేసింది ప్రేరణ. తను చెప్పిన పాయింట్స్‌ను ఎలా ఎదిరించాలో తెలియక సైలెంట్‌గా వెళ్లి జైలులో కూర్చున్నాడు తేజ. మొత్తానికి రెండు లెవెల్ నామినేషన్స్ పూర్తయ్యే సమయానికి గౌతమ్, నయని పావని, హరితేజ, యష్మీ, తేజ ఈవారం నామినేషన్స్‌లో ఉన్నారు.