BigTV English
Advertisement

High BP: ఏవండోయ్ ఈ విషయం విన్నారా? అలారంతో హై బీపీ వస్తుందట, జాగ్రత్త పడండి

High BP: ఏవండోయ్ ఈ విషయం విన్నారా? అలారంతో హై బీపీ వస్తుందట, జాగ్రత్త పడండి
High BP: అలారం పెట్టుకుని నిద్రలేచే వారికి ఇది షాకింగ్ విషయమే. ఎవరైతే అలారం పెట్టుకుని ఉదయాన్నే ఆ శబ్దానికి ఉలిక్కిపడి లేస్తారో.. వారంతా అతి త్వరలో అధిక రక్తపోటు బారిన పడతారట. ఈ విషయాన్ని UVA స్కూల్ ఆఫ్ నర్సింగ్ లో ప్రచురించారు. ఒక అధ్యయనంలో అలారం వల్ల అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉన్నట్టు తేలింది.  ఈ అధ్యయనంలో అలారం శబ్దంతో మేల్కొనే వారిలో రక్తపోటు 74 శాతం పెరిగినట్టు అధ్యయనకర్తలు చెబుతున్నారు.


రాత్రి పూట ఏడుగంటల కన్నా తక్కువ సమయం నిద్రపోయిన వారిలో బీపీ పెరుగుదల కూడా ఎక్కువగా ఉన్నట్టు ఈ అధ్యయనంలో  తెలిసింది. బీపీ పెరిగిందంటే మీ గుండెకు రక్షణ కరువైనట్టే. గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలు పెరిగిపోతాయి. కచ్చితంగా అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.

అలారం మిమ్మల్ని గాఢ నిద్ర నుండి అకస్మాత్తుగా మేల్కొలుపుతుంది. దీనివల్ల ‘నిద్రా జడత్వం’ ఏర్పడుతుంది. ఒక రెండు గంటల పాటు మీరు గజిబిజిగా ఉంటారు. ఆ సమయంలో ఒత్తిడి స్థాయిలు కూడా అధికంగా ఉంటాయి. దీని వల్లే రక్తపోటు కూడా పెరుగుతుంది. రక్తనాళాల్లో రక్తం అత్యంత వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది. అది రక్తనాళాల గోడలను గుద్దుకుంటూ ప్రవహిస్తుంది. దీనివల్ల రక్తపోటు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మీకు వీలైనంత వరకు అలారం అలవాటును మానుకోవాలి. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ఒకే సమయానికి లేవడం అలవాటు చేసుకుంటే మీకు అలారం అవసరమే ఉండదు.


చీకటి గదిలో నిద్రపతే ఎప్పుడు తెల్లవారిందో తెలుసుకోవడం కష్టమే. అలాంటి వారే ఎక్కువగా అలారాన్ని వాడతారు. అలా కాకుండా సహజంగా కాంతి మీ గదిలోకి వచ్చేటట్టు చూసుకోండి. దీనివల్ల తెల్లవానగాపూ ఆ కాంతి  మీ శరీరాన్ని చేరుతుంది. మీ మెదడులో స్లీప్ హార్మోన్ అయినా మెలటోనిన్ ఉత్పత్తి తగ్గుతుంది. దీనివల్ల మీరు సహజంగానే మేల్కొంటారు. ప్రతిరోజూ రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటలకు తగ్గకుండా నిద్రపోయే వారిలో అలారం పెట్టాల్సిన అవసరం లేదని తేలింది. అలాగే ఎవరైతే ఒకే నిద్రా సమయాలను పాటిస్తారో వారికి కూడా అలారం అవసరం లేదు.

అలారం అవసరం లేకుండా
కాబట్టి మీ నిద్ర షెడ్యూల్‌ను క్రమబద్ధం చేసుకోండి… అంటే ప్రతి రాత్రి ఒకే సమయానికి నిద్రపోవడం, ప్రతిరోజు ఉదయం ఒకే సమయానికి నిద్ర లేవడం అలవాటు చేసుకుంటే కేవలం రెండు వారాల్లోనే మీ నిద్ర షెడ్యూల్ ఫిక్స్ అయిపోతుంది. అప్పుడు మీకు అలారం అవసరం పడదు. ఒకవేళ అలారం తప్పనిసరిగా పెట్టుకోవాల్సి వస్తే పెద్ద శబ్దాలు, మాస్ పాటలు పెట్టుకోకుండా శ్రావ్యమైన సంగీతాన్ని పెట్టుకోండి. అది కూడా శబ్దం తక్కువ స్థాయి నుండి ఎక్కువ స్థాయికి ప్రయాణించే విధంగా ఉన్న శబ్దాన్ని పెట్టుకుంటే ఉత్తమం. మొదటే పెద్ద శబ్దంతో అలారం మోగితే మీరు ఉలిక్కిపడి లేస్తారు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి.

అలారం నుంచి వచ్చే పెద్ద శబ్దం వల్ల సౌండ్ స్లీప్ అకస్మాత్తుగా అంతరాయం కలుగుతుంది. ఇది మీలో భయాందోళనలను పెంచుతుంది. కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది. కార్టిసాల్ అనేది ఒత్తిడి హార్మోను. ఇది ఎప్పుడైతే ఉదయాన్నే పెరుగుతుందో మీకు ఆ రోజంతా చిరాకుగా, ఆత్రుతగా, కోపంగా ఉంటుంది. ఉదయాన ప్రశాంతంగా లేచిన వారే ఆ రోజంతా ప్రశాంతంగా పనులు చేయగలుగుతారు.

ప్రతిరోజూ రాత్రి 10 గంటలకు నిద్రపోయి, ఉదయం ఆరు గంటలకి నిద్ర లేవడం అలవాటు చేసుకోండి. ఇది ఎంతో ఉత్తమ నిద్రా సమయాలు. ఆ రాత్రి నిద్ర కూడా మీ శరీరానికి సరిపోతుంది. మానసికంగా, శారీరకంగా మీరు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఇది మీలో ఒత్తిడిని, హృదయ స్పందన రేటును అదుపులో ఉంచుతుంది. ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఉదయం నిద్ర లేవడం వల్ల ఆనందంగా జీవించగలుగుతారు.

Related News

Blue number Plates: ఏ వాహనాలకు బ్లూ నెంబర్ ప్లేట్లు ఉంటాయి? 99 శాతం మందికి తెలియదు

Parenting Tips: మీ పిల్లలు అన్నింట్లో ముందుండాలా ? ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వండి !

Coffee Face Mask: కాఫీ ఫేస్ మాస్క్‌తో.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం

Vertigo Problem: రోజూ నిద్రలేవగానే తల గిర్రుమంటోందా.. వర్టిగో గురించి తెలియాల్సిన సమయమిదే!

 Ajwain Seed Water: వాము నీరు తాగితే.. నమ్మలేనన్ని లాభాలు !

Cracked Heels: మడమల పగుళ్లకు అసలు కారణాలు తెలిస్తే.. షాక్ అవుతారు

Rainbow Puri: రెయిన్‌బో పూరీ..ఇలా తయారు చేసుకుని తింటే అదిరిపోయే టేస్ట్

Kothmira Pachadi: నోరూరించే కొత్తిమీర పచ్చడి.. సింపుల్‌గా ఇలా తయారు చేయండి !

Big Stories

×