Beetroot For Skin: బీట్‌రూట్ ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా మీ చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగపడుతుంది. ఆయిల్ స్కిన్‌తో ఇబ్బంది పడుతున్న వారు చర్మానికి
సహజమైన మెరుపును అందించాలనుకుంటే అలాంటి వారు బీట్‌రూట్ ఉపయోగించడం మంచిది.
బీట్‌రూట్‌లో ఉండే సహజమైన బ్లీచింగ్ లక్షణాలు టానింగ్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ చర్మానికి ఆరోగ్యకరమైన మెరుపును అందిస్తాయి. బీట్‌రూట్‌లో ఉండే పోషకాలు మీ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంతో పాటు పొడిబారకుండా నిరోధిస్తాయి. బీట్‌రూట్ పౌడర్‌తో పాటు కొన్ని రకాల పదార్థాలను ఉపయోగించి ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని ముఖానికి ఉపయోగించవచ్చు. ఇవి ఫేస్‌పై జిడ్డును తొలగించి మెరిసేలా చేస్తాయి.
1. బీట్‌రూట్ పౌడర్, పాలు:
కావలసినవి:
బీట్‌రూట్ పౌడర్- 1 టేబుల్ స్పూన్
పాలు- 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం: పైన చెప్పిన మోతాదుల్లో బీట్ రూట్, పాలు తీసుకుని ఒక బౌల్‌లో వేసి మిక్స్ చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం ద్వారా మీ చర్మాన్ని లోపలి నుండి కాంతివంతంగా మారుతుంది. ఇవి డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్‌ని తగ్గించి మీ చర్మాన్ని శుభ్రపరుస్తుంది. ఇది మీ చర్మాన్నిమెరిసేలా చేస్తుంది.
2. బీట్‌రూట్ పౌడర్, ముల్తానీ మిట్టి:
కావలసినవి:
బీట్‌రూట్ పౌడర్- 1 టేబుల్ స్పూన్
ముల్తానీ మిట్టి- 1 టీ స్పూన్
రోజ్ వాటర్ – తగినంత
తయారీ విధానం: పైన చెప్పిన మోతాదుల్లో బీట్ రూట్ పౌడర్‌తో పాటు, ముల్తానీ మిట్టి, రోజ్ వాటర్ తీసుకుని ఒక బౌల్‌లో వేసి మిక్స్ చేసుకోవాలి. దీనిని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం ద్వారా ముఖం అందంగా మారుతుంది. అంతే కాకుండా ముఖంపై ఉన్న జిడ్డు తొలగిపోతుంది. బీట్‌రూట్‌లో ఉండే పోషకాలు మీ చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచడంలో సహాయపడతాయి.
Also Read: టమాటోతో ఇలా చేస్తే ఎంతటి మచ్చలు, మొటిమలైనా మాయం అవ్వాల్సిందే !
3.బీట్‌రూట్ పౌడర్, రోజ్ వాటర్:
కావలసినవి:
బీట్‌రూట్ పౌడర్- 1 టేబుల్ స్పూన్
వేప పొడి- 1 టీ స్పూన్
రోజ్ వాటర్ – తగినంత
తయారీ విధానం: ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి బీట్‌రూట్ పౌడర్, రోజ్ వాటర్, వేప పొడి ఒక బౌల్‌లో వేసి మిక్స్ చేయాలి. తర్వాత దీనిని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. వేపలో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మ వ్యాధులను తగ్గిస్తాయి.బీట్‌రూట్ చర్మానికి సహజమైన మెరుపును అందిస్తుంది. ఈ మాస్క్ మీ చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. తరుచుగా ఈ ఫేస్ ప్యాక్ లను వాడటం వల్ల చర్మం అందంగా మారుతుంది. అంతే కాకుండా ముఖంపై ఉన్న మొటిమలు కూడా తగ్గుతాయి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.