Big Stories

Benefits of Spices: స్పైసీ ఫుడ్‌తో వ్యాధులకు చెక్.. ఇది పెయిన్ కిల్లర్ అని మీకు తెలుసా..?

spicy food
spicy food

Health Benefits of Spicy Food: కొంతమందికి స్పైసీ ఫుడ్‌కి చాలా దూరంగా ఉంటే.. మరికొంత మంది స్పైసీ ఫుడ్ చాలా ఇష్టంగా తింటుంటారు. స్పైసీ ఫుడ్ లేకుండా కనీసం ఏ ఫుడ్ కూడా తీసుకోని వారు చాలా మంది ఉన్నారు. తాము ఏది తిన్నా కారంగా ఉండాలని అనుకుంటారు. కొంతమంది అయితే ఏకంగా అన్నంలో కారం, నూనెను కూడా కలుపుకుని తింటుంటారు. అయితే ఇలా తినడం ఆరోగ్యానికి మంచిదే. అలా అని మరీ ఎక్కువ కారం కాకుండా.. స్పైసీ ఫుడ్ తీసుకోవడం శరీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. శరీరానికి కారంతో చేసిన ఆహారం పట్టించకపోతేనే అనేక రోగాలు వస్తాయని అంటున్నారు. మనం తీసుకునే ఆహారంలో తరచూ స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని సూచిస్తున్నారు.

- Advertisement -

కొంతమంది స్పైసీ ఫుడ్ తినడం వల్లే అనారోగ్యం బారిన పడతారని అనుమానాలు వ్యక్తం చేస్తారు. కానీ స్పైసీ ఫుడ్ తినడం వల్లే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల జీవక్రియ రేటు మెరుగుపడుతుంది. శరీరంలో కేలరీలను తగ్గించడానికి స్పైసీ ఫుడ్ చాలా ఉపయోగపడుతుందట. మిరపకాయల్లో ఉండే క్యాప్సైసిన్ ఈ పనులు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు బరువు తగ్గాలనుకునే వారికి స్పైసీ ఫుడ్ ముఖ్యపాత్ర పోషిస్తుందని సూచిస్తున్నారు.

- Advertisement -

1. పెయిన్ కిల్లర్:

స్పైసీ ఫుడ్ మన శరీరానికి ఓ పెయిన్ కిల్లర్ గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మిరపకాయలో ఉండే పోషకాలు శరీర వాపును తగ్గిస్తాయట. అంతేకాదు ఇందులో ఉండే క్యాప్సైసిన్ లో నొప్పి నివారణ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. తరచూ స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల కండరాల నొప్పి, ఆర్థోరైటీస్ వంటి నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

Also Read: Healthy Drinks: పరగడుపున ఈ డ్రింక్ తాగితే ఎన్ని లాభాలో.. ఆ సమస్యలకు చెక్

2. ఇమ్యూనిటీ పవర్:

శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంతో స్పైసీ ఫుడ్ చాలా బాగా సహకరిస్తుంది. మిరపకాయలో ఉండే యాంటా ఆక్సిడెంట్లు మన కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడడమే కాకుండా వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది.

3. పెప్టిక్ అల్సర్ నివారణ:

తరచూ మందులను వాడడం, పైలోరీ బ్యాక్టీరియా వల్ల అల్సర్ బారినపడుతుంటాం. కానీ చాలా మంది స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్లే అల్సర్ వస్తుందని అపోహ పడుతుంటారు. స్పైసీ ఫుడ్ లో ఉండే క్యాప్సైసిన్ కడుపులో యాసిడ్ తో పోరాడి ఉపశమనాన్ని ఇస్తుంది. క్యాప్సిసైన్ ద్వారా అల్సర్ వంటివి అడ్డుకోవచ్చు.

4. క్యాన్సర్:

స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. మిర్చీలో ఉండే యాంటీ ఆక్సీడెంట్లు, పోషకాలు, క్యాప్సైసిన్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించేందుకు తోడ్పడుతుంది.

Also Read: Papaya Leaf Benefits: బొప్పాయి ఆకులతో అనేక ప్రయోజనాలు.. ఆ వ్యాధులకు చెక్

మిరపకాయతో ఇవే కాకుండా చాలా రకాల వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. మిరపకాయలో ఉండే క్యాప్సైసిన్ చెడు కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతే కాదు స్పైసీ ఫుడ్ తీసుకున్న వారి ఆయుష్షును కూడా పెంచుకోవచ్చు. ఈ మేరకు హార్వర్డ్స్ టి.హెచ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ చేసిన అధ్యయనంలో తేలింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News