Big Stories

Japan Vs North Korea: చర్చలకు సిద్ధమైన జపాన్.. ఆ విషయంలో తగ్గెదే లే అంటున్న కిమ్..!

Japan vs North Korea

- Advertisement -

Japan Vs North Korea: గత కొన్ని నెలలుగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాలు ప్రపంచాన్ని యుద్ధ వాతావరణం వైపు తీసుకువెళ్లాయి. ఈ నేపథ్యంలో ఏ రెండు దేశాల మధ్య వివాదం చెలరేగినా సరే యుద్ధం వాతావరణం నెలకొంటుంది. ఈ తరుణంలో జపాన్-ఉత్తర కొరియా మధ్య వివాదం తలెత్తింది. గత కొన్నేళ్లుగా ఈ రెండు దేశాల మధ్యం వివాదాలు జరుగుతున్నా ప్రస్తుత పరిస్థితుల దృష్యా యుద్ధం జరగొచ్చనే వార్తలు ఊపందుకున్నాయి. అయితే ఈ వార్తలకు ఉత్తరకొరియా చెక్ పెట్టింది. త్వరలోనే రెండు దేశాల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది.

- Advertisement -

జపాన్-ఉత్తరకొరియా మధ్య 1910వ సంవత్సరం నుంచి వైరం కొనసాగుతోంది. అయితే గత కొన్ని రోజులుగా ఈ రెండు దేశాల మధ్య వివాదం మరింత ఉద్రిక్తర పరిస్థితితులు నెలకొన్నాయి. బద్ధ శత్రువులైన ఉత్తరకొరియా-జపాన్ ల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉందని ప్యాంగ్ యాంగ్ పాలకుడు కిమ్ జోంగ్ ఉన్న సోదరి కిమ్ యో జోంగ్ వెల్లడించారు. తన సోదరుడితో జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా చర్చల కోసం అభ్యర్థించారని ఆమె తెలిపారు. ప్రస్తుతం టోక్యో అనుసరిస్తున్న విధానాల్లో ఎటువంటి మార్పులు లేకుండా చర్చలు జరిగినా ఫలితం ఉండదని ఆమె తెలిపారు.

వీలైనంత త్వరగా తమతో చర్చలు జరపాలని కిమ్ జోంగ్ ను కిషిదా కోరారని అన్నారు. అయితే తాము చర్చలు జరిపి కొత్త అధ్యయాన్ని ప్రారంభించాలంటే జపాన్ రాజకీయ నిర్ణయమే కీలక పాత్ర పోషిస్తుందని ఆమె తెలిపారు. జపాన్ ఇంకా అపహరణలపైనే దృష్టి పెడితే దానికి చర్చలతో పనిలేదని తేల్చి చెప్పారు. ఆయన కోరుకున్నంత మాత్రనా చర్చలు జరిగే అవకాశం లేదన్నారు. అదంతా టోక్యో చేతుల్లో ఉందని కిమ్ యో జోంగ్ స్పష్టం చేశారు.

Also Read: Bridge Collapse: ఘోర ప్రమాదం.. నౌక ఢీకొని ఒక్కసారిగా కుప్పకూలిన వంతెన

కిమ్ యో జోంగ్ చేసిన ఈ వ్యాఖ్యలపై జపాన్ ప్రధాని కిషిదా కూడా స్పందించారు. చర్చలకు సంబంధించిన అంశాలపై తాను బహిరంగంగా మాట్లాడదలచుకోవడం లేదన్నారు. అయితే ఉత్తరకొరియాతో జరిపే చర్చలు మాత్రం చాలా కీలకమని పేర్కొన్నారు. అపహరణ అంశంపై ఉన్నత స్థాయిలో చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం వీటిపై పార్లమెంట్ లో కూడా చర్చలు జరుపుతున్నాయన్నారు.

ఈ ప్రకటనపై నేడు జపాన్‌ ప్రధాని కిషిదా కూడా స్పందించారు. తనకు కేసీఎన్‌ఏ సంస్థ రిపోర్టుల గురించి తెలియదన్నారు. ఆ చర్చలకు సంబంధించిన అంశాలపై బహిరంగంగా మాట్లాడనని తెలిపారు. ఉత్తరకొరియాతో చర్చలు కీలకమని పేర్కొన్నారు. మరోవైపు అపహరణల అంశం వంటి వాటిల్లో ఉన్నత స్థాయి చర్చలు జరిపి పరిష్కారం కనుగొనటం చాలా ముఖ్యమని ఆయన ఇటీవల పార్లమెంట్‌లో కూడా పేర్కొన్నారు.

Also Read: Moscow Terror Attack: మాస్కో ఉగ్రదాడి.. కోర్టులో నేరాన్ని అంగీకరించిన ముష్కరులు

దాదాపు 100 సంవత్సరాలుగా ఈ రెండు దేశాల మధ్య వివాదం కొనసాగుతూనే వస్తుంది. అప్పట్లో టోక్యో దళాలు కొరియాకు చెందిన ఓ ద్వీపకల్పాన్ని ఆక్రమించుకోని అక్కడ విధ్వసం సృష్టించాయి. దీంతో ఈ రెండు దేశాల మధ్య వివాదం మొదలైంది. టోక్యో చేసిన ఈ చర్యకు ప్రతిఘటనగా ఉత్తరకొరియా 1970,80ల్లో కొందరు ఏజెంట్లను జపాన్ కు పంపి.. 13 మందిని కిడ్నాప్ చేసింది. వీరి సాయంతో తమ దేశంలోని గూఢచారులకు జపాన్ భాష, ఆచారాల్లో శిక్షణ ఇప్పించాలని భావించింది. అయితే ఈ విషాయన్నా 2002లో ఉత్తరకొరియా అంగీకరించింది. అయితే అప్పట్లో జరిగిన ఈ వివాదాన్ని పక్కన పెడితేనే ప్రస్తుతం చర్చలు జరుపుతామని ఉత్తరకొరియా వెల్లడించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News