BigTV English

Gymnema or podapatri Sylvestre: షుగర్ పేషెంట్లు ఇక ఏదిపడితే అది తినేయొచ్చు..గుడ్ న్యూస్ చెప్పేశారు

Gymnema or podapatri Sylvestre: షుగర్ పేషెంట్లు ఇక ఏదిపడితే అది తినేయొచ్చు..గుడ్ న్యూస్ చెప్పేశారు

Blood Sugar Can Decrease Rapidly through Gymnema or podapatri Sylvestre: ప్రపంచంలోనే ఎక్కువ శాతం మందిని వేధిస్తున్న సమస్య డయాబెటీస్. కేవలం ఆహార అలవాట్లు నియంత్రించుకోకపోవడమే షుగర్ వ్యాధికి మూల కారణం. దీనికి తోడు మానసిక ఒత్తిడులు, సరైన ఎక్సర్ సైజ్ లేకపోవడం అన్నీ వెరసి షుగర్ వ్యాధి గ్రస్తులను మరింత ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. అయితే షుగర్ వ్యాధి ఒకసారి మనిషికి వచ్చాక తగ్గడమనేది జరగదు. రోజూ ట్యాబ్లెట్లు, ఇన్సులిన్ విధిగా తీసుకోవాల్సిందే. పైగా ఆహారం విషయంలోనూ ఆంక్షలు..దీనితో మనిషి మరింత నీరసించి పోతున్నాడు. షుగర్ ఎక్కువైతే ఒక్కోసారి శరీర అవయవాలు కూడా తీసేయవలసి ఉంటుంది. షుగర్ రిలేటెడ్ గా కిడ్నీలు, రక్తప్రసరణ తదితర వ్యాధులు ఉత్పన్నమవుతాయి. కడుపు నిండా ఆహారం తీసుకోవడానికి కూడా వీలులేని పరిస్థితి.


అరుదైన ఔషధ మొక్క

ఇప్పుడు షుగర్ పేషెంట్లు నిరభ్యంతరంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా ఆహారం తీసుకోవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి బీహార్ రాష్ట్రంలోని బ్రహ్మయెని పర్వత ప్రాంతంలో దొరికే అరుదైన మొక్క గుర్మార్ పై ఇటీవల పరిశోధనలు చేశారు. ఇదో అరుదైన ఔషధ మొక్క దీనిని తెలుగులో పొడపత్రి అంటారు. ఈ గుర్మార్ మొక్కలో జిమ్నెమిక్ యాసిడ్ ఉంటుంది. మనిషి శరీరంలో ఉండే లివర్ పై అద్భుత ఫలితాన్ని చూపిస్తుంది. పేగు పొరలపై ఆహార పదార్థాలను తేలికగా గ్రహించే పొర ఉంటుంది. అది ఎక్కువగా తీపిని సంగ్రహించుకుంటుంది. అయితే గుర్మార్ ప్రభావంతో ఏర్పడే పొరతో తియ్యటి పదార్థాలను తినాలనే కోరిక చచ్చిపోతుంది. దీనితో స్వీట్ల జోలికి వెళ్లకూడదని షుగర్ పేషెంట్లు డిసైడ్ అవుతారు.


పరిశోధనలు జరుగుతున్నాయి

గుర్మార్ ప్రభావంతో రక్తంలో ఉన్న షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి. ప్రస్తుతం ఈ ఔషధ మొక్కలపై పరిశోధనలు జరుగుతున్నాయి. త్వరలోనే ఓ కొలిక్కి వస్తాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ అరుదైన ఔషధ మొక్క గుర్మార్ అంతరించిపోకుండా భవిష్యత్ తరాల వారికి కూడా ఉపయోగపడేలా గుర్మార్ ఔషధ మొక్కల పెంపకం చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ణప్తి చేస్తున్నారు. బ్రహ్మయెని ప్రాంతంలో ఇంకా విలువైన ఔషధ మొక్కలు చాలానే ఉన్నాయి. వాటిమీద కూడా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.

పొడపత్రి పౌడర్ రూపంలో..

గుర్మార్ లేక పొడపత్రి ఎక్కువా దక్షిణ ప్రాంతపు ఉష్ణ మండల అడవులలో పెరుగుతాయి . వీటి ఆకులను ఎండబెట్టి పొడిగా చేసి ఆయుర్వేద షాపులలోనూ అమ్ముతున్నారు. ప్రతి రోజూ గోరువెచ్చని నీటితోనో లేక పాలతోనో ఈ పొడపత్రి చూర్ణం తీసుకుంటే షుగర్ వ్యాధి ఏ స్థాయిలో ఉన్నా వెంటనే కంట్రోల్ కి వచ్చేస్తుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు. ఇక ఆహర నియంత్రణ ఏదీ పాటించకుండానే ఏదైనా తినేయ్యొచ్చు షుగర్ పేషెంట్లు.

Related News

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

White Foods: ఆరోగ్యాన్ని దెబ్బతీసే.. 3 తెల్లటి ఆహార పదార్థాలు, వీటితో.. ఇంత డేంజరా ?

Dengue Fever: వర్షాకాలంలో జ్వరమా ? డెంగ్యూ కావొచ్చు !

Big Stories

×