Big Stories

Sleep Apnea : స్లీప్ ఆప్నియా.. ఈ ఆహారాలతో గుడ్ బై చెప్పండి!

Sleep Apnea Symptoms

- Advertisement -

 

- Advertisement -

Sleep Apnea Symptoms : మొక్కల నుంచి లభ్యమయ్యే ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంత మంచిదో మనందరికీ తెలుసు. ఆరోగ్య నిపుణులు కూడా అనేక సందర్భాల్లో విటి గురించి చెబుతుంటారు. మొక్కల ఆధారిత ఆహారం తరచుగా తింటే మెదడు, గుండె ఆరోగ్యంగా మెరుగ్గా ఉంటుంది. శరీరానికి రోగనిరోధక శక్తి పుష్కలంగా లభిస్తుంది. ఎక్కువ కాలం ఎటువంటి అనారోగ్యాల బారిన పడకుండా హెల్దీగా ఉంటాము.

అయితే మొక్కల నుంచి లభ్యమయ్యే ఆహారం స్లీప్ అప్నియా సమస్యను నివారించడంలో కూడా సహాయపడుతుందని తాజాగా ఓ నివేదికలో తేలింది. ఇప్పుడు మొక్కల నుంచి లభ్యమయ్యే ఆహారం స్లీప్ అప్నియా సమస్యను నివారించడంలో ఎలా సహాయపడుతుందో చూద్దాం..

Read More : ఫుడ్ అలర్జీతో బాధపడుతున్నారా? ..ఈ చికిత్సలతో చెక్ పెట్టండి..!

ఈఆర్జే ఓపెన్ అధ్యయనం ప్రకారం.. ఎక్కువ పండ్లు, కూరగాయలు, గింజలు కలిగిన ఆహారం తీసుకున్న వారిలో స్లీప్ అప్నియా ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. ఇటువంటి ఆహారాన్ని తీసుకున్నే వ్యక్తులలో స్లీప్ అప్నియా వచ్చే ప్రమాదం 19 శాతం కంటే తక్కువగా ఉంటుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఫ్రై చేసిన ఆహారాలు, ఉప్పు, కారం చక్కెరలు ఎక్కువగా ఉన్న ఆహారాలు తినే వారిలో స్లీప్ అప్నియా వచ్చే ప్రమాదం 22 శాతం ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు.

మొక్కల నుంచి వచ్చే ఆహారాన్ని తీసుకోవడం వల్ల అధిక బరువు ప్రమాదం నుంచి బయటపడొచ్చు. ఊబకాయం వంటి అనారోగ్య సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు. శరీర బరువు అధికంగా ఉండటం స్లీప్ అప్నియాకు ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Read More : ఒంటరి స్త్రీలలో డిప్రెషన్ ప్రమాదం.. మూడు నెలలు ఇలానే ఉంటే..!

స్లీప్ ఆప్నియా కారణంగా నిద్రలో పెద్దగా గురక వస్తుంది. చాలా మంది గురక పెట్టి నిద్రపోతుంటే గాఢనిద్రగా భావిస్తారు. ఆ భావన సరైనది కాదు. స్లీప్ అప్నియా వల్ల నిద్రలో కొద్దిసేపు శ్వాస ఆగిపొతుంది. అలానే గొంతులోని కండరాలు బాగా వదులై శ్వాస లోపలికి, బయటికి వెళ్లే మార్గానికి అడ్డొస్తాయి.

అంతేకాకుంగా స్లీప్ ఆప్నియా కారణంగా శరీరంలో ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది. ఇలాంటి సందర్భాల్లో మెదడుకు రక్తప్రసరణలో అంతరాయం కలుగుతుంది. ఇది వారికి గుర్తుండదు. ఇది మన స్లీప్ క్వాలిటీని దెబ్బతిస్తుంది.

స్లీప్ అప్నియా లక్షణాలు ఈ విధంగా ఉంటాయి

1. సరైన నిద్ర ఉండదు.

2. నిద్రలో గురక ఉంటుంది.

3. నిద్రలో శ్వాస తీసుకోవడం ఇబ్బందిని కలిగిస్తుంది.

4. నిద్రలో మేల్కొంటుంటారు.

5. ఒత్తిడికి గరువుతారు.

6. తలనొప్పి అధికంగా ఉంటుంది.

7. నిద్ర లేచిన తర్వాత అలసిపోయినట్లుగా ఫీల్ అవుతారు.

8. ఊపిరి బలంగా పీల్చుకోవడం.

9. నిద్రలో కదలికలు.

10. నోరు పొడిబారినట్లుగా మారడం.

11. రాత్రి తరచుగా బాత్రూంకి వెల్లడం.

12. రోజంతా నిద్రమత్తుగా ఉండటం.

13. అధికంగా కోపం రావడం జరుగుతుంది.

Disclaimer : ఈ కథనాన్ని పలు వైద్య అధ్యయనాలు అధారంగా మీ అవగాహన కోసం అందిస్తున్నాం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News