Mohammad Mokhber Appointed as interim President for Iran: హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందారు. ఈ క్రమంలో ఆయన స్థానంలో తాత్కాలిక అధ్యక్షుడిగా మొహమ్మద్ మొఖ్బర్ ను నియమించారు.
అయితే, మొఖ్బర్ కు సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో మంచి సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా మొఖ్బర్ కు రాజకీయంలో మంచి అనుభవం ఉంది. పరిపాలన పరంగా కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. 1995 సెప్టెంబర్ 1న జన్మించిన మొఖ్బర్ కు ఇరాన్ రాజకీయ, ఆర్థిక రంగాల్లో బలమైన నాయకుల్లో ఒకరిగా మంచి గుర్తింపు ఉంది. అదేవిధంగా ఈయన 2021 ఎన్నికల్లో ఇబ్రహీం రైసీ విజయం సాధించడంతో ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ప్రస్తుతం మొఖ్బర్ ను ఇరాన్ దేశ అధ్యక్షుడిగా నియమించారు. దీంతో ఆయన పదవీ బాధ్యతలను స్వీకరించారు.
అదేవిధంగా అలీ బగేరి ఖానీను విదేశాంగ శాఖ మంత్రిగా నియమించారు. కాగా, హుస్సేన్ అమిరాబ్దొల్లాహియన్ స్థానంలో అలీ బగేరి ఖానీను నియమించింది ఇరాన్ కేబినెట్. ఖానీ ప్రస్తుతం విదేశాంగ శాఖ ఉప మంత్రిగా కొనసాగుతున్నారు. ఇరాన్ సుప్రీం నేషనల్ సెకయూరిటీ కౌన్సిల్ లో 2007 నుంచి 2013 వరకు డిప్యూటీ సెక్రటరీగా పని చేశారు.
Also Read: Ebrahim Raisi Death: సంతాపాలు సరే.. సంబరాల సంగతేంటి?
నూతనతంగా నియమింపబడ్డ వీరిద్దరూ కూడా వచ్చే 50 రోజులపాటు అనగా నూతన అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు వీరు ఆ పదవుల్లో కొనసాగుతారని, ఆ తరువాత ఇరాన్ నూతన అధ్యక్షుడిని ఎన్నికుంటారని అక్కడి మీడియా పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ శాఖ మంత్రి అమిరబ్దొల్లాహియన్ ఆదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు. వీరి మృతికి సంతాపంగా ఐదు రోజుల సంతాప దినాలను ఇరాన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్ లోని ఓ హెలికాప్టర్ అనుమానాస్పద స్థితిలో కుప్పకూలిపోయింది. ఇరాన్ రాజధాని అయినటువంటి టెహ్రాన్ కు 600 కిలో మీటర్ల దూరంలో ఉన్నటువంటి తూర్పు అజర్ బైజాన్ దేశంలోని జోల్ఫా నగరం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఆదివారం అక్కడి మీడియా పేర్కొన్నది. ఆ సమయంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తోపాటు కాన్వాయ్ లోని ఇంకో రెండు హెలికాప్టర్లు ఉన్నాయని పేర్కొన్నది. ఇబ్రహీం రైసీతోపాటు విదేశాంగ మంత్రి హోసేన్ అమిరబల్దొల్లాహియన్, తూర్పు అజర్ బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ తోపాటు పలువురు అధికారులు ప్రయాణిస్తున్నట్లు తెలిపింది.
Also Read: కుప్పకూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్..?
అయితే, ఆదివారం ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అజర్ బైజాన్ పర్యటనకు వెళ్లారు. అరస్ నదిపై అజర్ బైజాన్ దేశం, ఇరాన్ దేశం.. ఈ రెండు దేశాలు కలిసి ఓ డ్యామ్ ను నిర్మించాయి. నిర్మించినటువంటి డ్యామ్ ను అజర్ బైజాన్ అధ్యక్షుడు ఇల్హం అలియేవ్ తో కలిసి ప్రారంభించేందుకు రైసీ ప్రత్యేక హెలికాప్టర్ లో బైజాన్ బయల్లేరి వెళ్లారు. ఈ క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుందని అక్కడి మీడియా వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆ దేశ మీడియాలో పలు వార్తలు వచ్చాయి. హెలికాప్టర్ ప్రమాదంలో ఇబ్రహీం రైసీ మృతిచెందినట్లు ఆ వార్తా కథనాల్లో వెల్లడించాయి.