Health Benefits of Watermelon Seeds in Summer: ఎండాకాలంలో పుచ్చకాయలు ఎక్కువగా దొరుకుతుంటాయి. వేసవిలో పుచ్చకాయలను తినడం వల్ల శరీరాన్ని చల్లబరుచుకోవచ్చు. ఎందుకంటే పుచ్చకాయలో 90 శాతం వరకు నీరు ఉంటుంది. దీంతో పుచ్చకాయలను ఎక్కువగా తినడం వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవచ్చు. అయితే పుచ్చకాయలను తినడం వరకు సరే కానీ, అప్పుడప్పుడు పుచ్చకాయ గింజలను కూడా తింటుంటాం.
పుచ్చకాయ గింజనలు తినడం వల్ల చాలా మంది భయాందోళనకు గురవుతుంటారు. గింజలను తిన్నాం ఏం అవుతుందో అని కంగారు పడుతుంటారు. కానీ పుచ్చకాయ గింజలను తినడం వల్ల కూడా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉంటాయట. ఈ మేరకు నిపుణులు చెబుతున్నారు.
పుచ్చకాయతో పాటు పుచ్చకాయ గింజల్లోను పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పుచ్చకాయ గింజల్లో మెగ్నీషియం, ఐరన్, ప్రోటీన్, జింక్ వంటి అనేక రకాల పోషకాలు ఉంటాయి. అందువల్ల పుచ్చకాయ గింజలను తింటే శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అంతేకాదు అనేక వ్యాధుల బారిన పడకుండా చేస్తుందట. గింజల్లో విటమిన్ సీఎక్కువగా ఉంటుంది. అందువల్ల చర్మానికి గింజలను తినడం చాలా ప్రయోజనం అని నిపుణులు చెబుతున్నారు.
Also Read: మాయిశ్చరైజర్ ఇంజెక్షన్లు చర్మానికి మంచివేనా..?
పుచ్చకాయ గింజలను తినడం వల్ల చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుందట. అంతేకాదు జుట్టును కూడా ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. మరోవైపు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించేందుకు తోడ్పడుతుంది. పుచ్చకాయ గింజల్లో ఉండే మెగ్నీషియం జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మరోవైపు మధుమేహాన్ని కూడా తగ్గించేందుకు తోడ్పడుతుంది.
గింజల్లో ఉండే విటమిన్ బీ, ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచి ఎముకలు కూడా బలంగా ఉండేలా చేస్తాయట. మరోవైపు బోలు ఎముకల వ్యాధిని కూడా తగ్గేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక పుచ్చకాయ గింజలను తినడం వల్ల నాడీ వ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడుతుంది.