BigTV English

Tejashwi on Modo Comments: చేతులు జోడించి వేడుకుంటున్నా.. ప్లీజ్ అలా మాట్లాడొద్దు: భావోద్వేగంతో తేజస్వీ!

Tejashwi on Modo Comments: చేతులు జోడించి వేడుకుంటున్నా.. ప్లీజ్ అలా మాట్లాడొద్దు: భావోద్వేగంతో తేజస్వీ!

Tejashwi Yadav Respond to PM Modi Comments: ఆర్జేడీ నాయకుడు భావోద్వేగంతో తేజస్వీ యాదవ్ పలు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాజస్థాన్ లోని బాన్స్ వారాలో ఆదివారం నిర్వహించిన ప్రచార ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ.. కాంగ్రెస్ పై చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ఫైరయ్యాయి. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే చొరబాటుదారులకు, అధికంగా పిల్లలు ఉన్నవారికి సంపదంతా దోచిపెడుతుందన్న మోదీ వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపాయి.


ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అందుకే అసత్యాలు మాట్లాడుతున్నారంటూ ఫైరయ్యారు. అదేవిధంగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సైతం స్పందించి ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఖండించారు. ప్రధాని మోడీకి చేతులు జోడించి చెబుతున్నా.. సమస్యలపై మాట్లాడండి. అంతేకానీ, విద్వేషాలు రెచ్చగొట్టొద్దన్నారు. దేశాన్ని నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తుందని, చాలామంది పేదరికం నుంచి బయటపడేందుకు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారని, అదేవిధంగా ప్రజలు నిత్యావసర ధరలు పెరగడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అన్నారు.

Also Read:సంచలన వ్యాఖ్యలు చేసిన తేజస్వీ యాదవ్..


గత పదేళ్లలో మీరు దేశానికి ఏం చేశారో చెప్పాలని.. ముఖ్యంగా బీహార్ కు ఏం చేశారు చెప్పాలని తేజస్వీ యాదవ్ ప్రధాని మోదీని ప్రశ్నించారు. దేశాభివృద్ధికి, బీహార్ అభివృద్ధికి మీ విజన్ ఏంటో స్పష్టంగా వివరించాలి కానీ, అనవసర వ్యాఖ్యలు చేయొద్దన్నారు. దేశంలో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని, ప్రజల దృష్టిని మళ్లీంచేందుకు ప్రధాని అలా మాట్లాడుతున్నారని తేజస్వీ యాదవ్ అన్నారు.

ప్రధాని వ్యాఖ్యలపై తేజస్వీ యాదవ్ భావోద్వేగంతో స్పందించారు. ఇటు మిగతా ప్రతిపక్ష పార్టీలు కూడా తీవ్ర స్థాయిలో ఫైరయ్యాయి. ప్రధాని మోదీ అలా మాట్లాడడం సరికాదన్నారు. మోదీ తీవ్ర అసంతృప్తితోనే అలా మాట్లాడుతున్నారని వారు అన్నారు.

Tags

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×