BigTV English

Hair Fall: జుట్టు రాలుతుందా.. అయితే మీలో ఈ లోపం ఉన్నట్లే..

Hair Fall: జుట్టు రాలుతుందా.. అయితే మీలో ఈ లోపం ఉన్నట్లే..

Hair Fall: మారుతున్న జీవనశైలితో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. అందులో భాగంగా నీరసం, బలహీనత, అలసట వంటి అనేక రకాల సమస్యలను ఎదుర్కోంటున్నారు. ఈ కారణాల వల్ల చాలా మంది విటమిన్ డెఫిషియెన్సీతో బాధపడుతుంటారు. విటమిన్లలో ఏ ఒక్క విటమిన్ లోపం ఏర్పడినా కూడా శరీరం అనారోగ్యం పాలవుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల విటమిన్లు, పోషకాలు అందాలి. అయితే పోషకాలు అందకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. అందులో భాగంగానే హెయిర్ ఫాల్ కూడా ఓ సమస్యగా మారుతుంది. నీటి కారణంగా లేక శరీరానికి తగిన విటమిన్ అందకపోవడం వల్ల జుట్టు రాలడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అందులో భాగంగా జింక్ లోపం ఏర్పడితే జుట్టు రాలడం సమస్య ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే కేవలం ఈ సమస్య మాత్రమే కాకుండా అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు.


జింక్ లోపాన్ని ఎలా గుర్తించాలి..

శరీరంలో జింక్ లోపం ఏర్పడితే చాలా రకాల సమస్యలు ఎదురవుతాయి. శరీరానికి అనేక రకాల పోషకాలు అవసరం అందులో ముఖ్యమైనది జింక్ కూడా. అయితే జింక్ లోపం ఏర్పడితే జుట్టు రాలడం, రోగనిరోధక శక్తి, రక్త హీనత, విరేచనాలు, వంటి అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి.


ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు అశ్రద్ధ చేయకూడదు..

ఆకలి మందగించడం :

జింక్ సమస్య తలెత్తడం వల్ల ముందుగా ఆహారం తినాలనిపించదు. అంతేకాదు రుచి, వాసన కూడా అర్థం కాదు. ఆకలి తగ్గడం కూడా ప్రారంభం అవుతుంది.

అంటు వ్యాధులు :

శరీరంలో జింక్ లోపం ఏర్పడితే ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. జింక్ లోపం వల్ల రోగనిరోధక శక్తి కూడా బలహీనపడుతుంది. అంతేకాదు బ్యాక్టీరియా, వైరస్ వంటివి కూడా సోకే అవకాశాలు ఉంటాయి.

గాయాలు మానవు :

గాయాలను నయం చేయడానికి జింక్ అవసరం. జింక్ లోపం ఏర్పడిన వారిలో గాయాలు అయితే అవి త్వరగా మానవు. జింక్ లోపం వల్ల గాయం ఇన్ఫెక్షన్‌గా మారుతుంది.

జుట్టు రాలడం :

జింక్ లోపం ఏర్పడితే జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. దీంతో జుట్టు సన్నగా మారుతుంది. అంతేకాదు తలపై రంధ్రాలు ఏర్పడతాయి.

నివారణ మార్గాలు..

జింక్ లోపం ఉన్న వారిలో ఈ లక్షణాలు ఏర్పడతాయి. వీటితో బాధపడేవారు వైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా ఓట్స్, రెడ్ మీట్, గుమ్మడి గింజలు, విత్తనాలు, జీడిప్పపు, పండ్లు వంటి తీసుకోవడం వల్ల జింక్ ఎక్కువగా అంది లోపం నుంచి ఉపశమనం కలుగుతుంది.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×