BigTV English

Jamun fruit: నేరేడు పండ్లు తింటే ఈ అనారోగ్య సమస్యలన్నీ పరార్ !

Jamun fruit: నేరేడు పండ్లు తింటే ఈ అనారోగ్య సమస్యలన్నీ పరార్ !

Jamun Health Benefits: నలుపు, ఊదా రంగుల మిశ్రమంతో మిలమిలా మెరుస్తూ కనిపించే నేరేడు పండ్ల గురించి అందరికీ తెలుసు. కానీ వాటిని తినే వారు మాత్రం చాలా తక్కువ మందే ఉంటారు. వీటిలో ఉండే పోషకాల గురించి తెలిస్తే మాత్రం తినకుండా అస్సలు వదిలిపెట్టరు. నేరేడు ఆరోగ్యానికి అంత గొప్ప దివ్య ఔషధమని నిపుణులు చెబుతుంటారు. నేరేడు పండ్లు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


వర్షాకాలంలో ఎక్కువగా దొరికే నేరేడు పండ్లు ఆరోగ్యానికి దివ్యౌషధాలు. ఎన్నో రోగాలకు సహజ నివారిణిగా ఇవి పనిచేస్తాయి. అందుకే నేరేడు పండ్లు ఎక్కువగా దొరికే రోజుల్లో వీటిని అస్సలు మిస్సవ్వద్దు. నేరేడు పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
నేరేడు పండ్లు చూడటానికి చక్కని రంగుతో మిలమిలా మెరిసిపోతూ ఉంటాయి. అంతే స్థాయిలో ఆరోగ్యానికి కూడా ఇవి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. నేరేడు పండ్లలో పుష్కలంగా ఉండే విటమిన్ సి, ఫైటోకెమికల్స్, ఫినాలిక్ ఆమ్లంతో పాటు ఇతర పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
ఇన్ఫెక్షన్లకు చెక్:
అతిసారం, కలరా వ్యాధులతో పాటు ఇతరత్రా ఇన్ఫెక్షన్ల నుంచి మన శరీరాన్ని నేరేడు పండ్లు తినడం వల్ల కాపాడుకోవచ్చు. అంతే కాకుండా ఇవి దీర్ఘకాలిక దగ్గు, ఆస్తమా వ్యాధులు రాకుండా చేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తింటే కోరింత దగ్గు, బీపీ వంటివి తగ్గుతాయి.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది:
నేరేడు పండ్లును తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఫలితంగా మలబద్ధకం, గ్యాస్ ట్రబుల్, అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అధిక దాహం, అధిక మూత్రం వంటి లక్షణాలను కూడా ఇవి తగ్గిస్తాయి.

Also Read: తెలుసా?.. ఈ జ్యూస్‌ తాగితే గుండె సంబంధిత వ్యాధులు పరార్‌!


మధుమేహం నియంత్రణ:
మధుమేహ వ్యాధిగ్రస్తులకు నేరేడు పండ్లు తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. వీటిలో ఉండే పీచు పదార్థం, రక్తంలో చక్కెర స్థాయిలను తొందరగా పెరగకుండా నియంత్రిస్తుంది. వారంలో ఒకటి నుంచి రెండు సార్లు తక్కువ మోతాదులో నేరేడు పండ్లు తీసుకోవడం మంచిది.
గుండె ఆరోగ్యం ఆరోగ్యానికి మేలు:
నేరేడు పండ్లలో క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునేవారికి ఇవి మంచి చిరుతిండ్లుగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా వీటిలో ఉండే ఫైటో కెమికల్స్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. క్రమం తప్పకుండా నేరేడు పండ్లు తినడం వల్ల గుండె జబ్బులు అదుపులో ఉంటాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

Related News

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

White Foods: ఆరోగ్యాన్ని దెబ్బతీసే.. 3 తెల్లటి ఆహార పదార్థాలు, వీటితో.. ఇంత డేంజరా ?

Big Stories

×