BigTV English
Advertisement

Hibiscus Face Pack: ఈ ఫేస్ ప్యాక్ వాడారంటే.. అమ్మాయిలే అసూయపడే అందం మీ సొంతం

Hibiscus Face Pack: ఈ ఫేస్ ప్యాక్ వాడారంటే.. అమ్మాయిలే అసూయపడే అందం మీ సొంతం

Hibiscus Face Pack: ముఖం అందంగా, ఆకర్షణీయంగా ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. గ్లోయింగ్ స్కిన్ కోసం రకరకాల ఫేస్ ప్యాక్‌లను వాడుతుంటారు. అయినప్పటికీ కొన్ని సార్లు ఆశించిన ఫలితం లభించదు. ఇలాంటి సమయంలోనే మందార పూలతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ వాడటం మంచిది. మందార పూలలో ఉండే గుణాలు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. అంతే కాకుండా ముఖంపై మొటిమలు రాకుండా నివారిస్తాయి. స్కిన్ టోన్ మెరుగుపరుస్తాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న మందార ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకుని వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


మందార పూలలో అనేక పోషకాలు ఉంటాయి. ఇందులో పుష్కలంగా ప్రోటీన్లు ఉంటాయి. ఇవి చర్మానికి మేలు చేసే అనేక విటమిన్లను కలిగి ఉంటాయి. అందుకే వీటితో తయారు చేసిన ఫేస్ ప్యాక్ ముఖానికి చాలా మేలు చేస్తుంది.

మందారపూలతో ఫేస్ ప్యాక్ తయారీ:


1. గ్లోయింగ్ స్కిన్ కోసం:

కావాల్సినవి:
మందార పూలు- 4
విటమిన్ ఇ ఆయిల్- 2 టేబుల్ స్పూన్లు
తేనె- 2 టీ స్పూన్లు
తయారీ విధానం: ఎండిన మందార పూలను పొడిగా చేసుకోండి. తర్వాత ఇందులో విటమిన్ ఇ నూనె, తేనె కలిపి మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 5 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. అనంతరం ముఖానికి మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ఇలా 2- 3 సార్లు చేయడం వల్ల మీ ముఖం అందంగా మెరిసిపోతుంది.

2.సెన్సిటివ్ స్కిన్ కోసం:

మందార పూలు- 4
అలోవెరా జెల్- 2 టీ స్పూన్లు
పుదీనా ఆయిల్- 1 టీ స్పూన్

తయారీ విధానం: మందార పూలను ఆరబెట్టి పేస్ట్ లాగా తయారు చేసుకోండి. తర్వాత ఇందులో పైన చెప్పిన మోతాదులో అలోవెరా జుల్ కలపండి. తర్వాత పుదీనా ఆయిల్ వేసి పేస్ట్ తయారు చేయండి. ఈ పేస్ట్ ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత వాష్ చేయండి. దీని తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ఈ రెమెడీని 2 రోజులు వాడటం 2-3 సార్లు వాడినా చాలు ముఖం కాంతి వంతంగా తయారవుతుంది. అంతే కాకుండా తరుచుగా ఈ ఫేస్ ప్యాక్ ముఖానికి వాడటం వల్ల మృత కణాలు తొలగిపోతాయి.

3. మొటిమలు తగ్గించడానికి :

మందార పూలు – 2
తేనె- 1 టీ స్పూన్
అలోవెరా జెల్ – 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం: మందార పూలను రాత్రంతా నీటిలో నానబెట్టి పేస్ట్ లాగా తయారు చేసుకోండి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ తేనెతో పాటు 1 టేబుల్ స్పూన్ అలోవెరాను కలపండి. ఇలా తయారు చేసిన ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 10-15 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత చల్లటి నీటితో మీ ముఖాన్ని కడగండి. ఈ ఫేస్ ప్యాక్ ముఖంపై మొటిమలు తగ్గడానికి ఉపయోగపడుతుంది.అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది.

Also Read: వీటిని ఒక్కసారి వాడినా చాలు, ముఖంపై మచ్చలు మాయం

4. మందార పూలు, పాలతో ఫేస్ ప్యాక్:
కావాల్సినవి:
మందార పూలు- 2
పాలు- 1 టీ స్పూన్

తయారీ విధానం: ముందార పూలను ముందుగా మిక్సీలో వేసుకుని పేస్ట్ లాగా తయారు చేయండి. తర్వాత దీనిలో టీ స్పూన్ పాలు వేసి మిక్స్ చేయండి. ఇలా తయారు చేసిన ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి. తర్వాత 15 నిమిషాలు ఆగి కడిగేయండి. ఇలా తరుచుగా చేయడం వల్ల ముఖం అందంగా మెరిసిపోతుంది.

Related News

Farmer’s Honor: పండ్లు, కూరగాయల మీద పండించిన రైతుల ఫోటో.. ఎంత మంచి నిర్ణయమో!

Tulsi Leaves: ప్రతిరోజు ఉదయం తులసి ఆకులను నమిలితే.. ఏమవుతుంది ?

Let them go: వెళ్లేవాళ్లని వెళ్లనివ్వండి బాసూ.. లేదంటే మనసును బాధపెట్టినవాళ్లవుతారు!

Foot Massage: ఏంటీ.. త‌ర‌చూ ఫుట్ మ‌సాజ్ చేసుకుంటే ఇన్ని లాభాలా!

Hair Thinning: జుట్టు పలచబడుతోందా ? అయితే ఈ ఆయిల్స్ వాడండి !

Jamun Seeds Powder: నేరేడు విత్త‌నాల పొడిని ఇలా వాడారంటే.. ఎలాంటి రోగమైన పారిపోవాల్సిందే!

Perfume in car: కారులో పెర్ఫ్యూమ్ వాడడం ఎంత ప్రమాదకరమో తెలిస్తే ఇప్పుడే తీసి పడేస్తారు

Water: రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీరు తాగే.. అలవాటు మీలో ఉందా ?

Big Stories

×