Kethi Reddy: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణపై కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ ఒక హిందూపురం తప్ప మరెక్కడా గెలవలేడని.. గుడివాడలో పోటీ చేసి గెలిపి చూపించాలని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడి చేతిలో పవన్ కల్యాణ్ కీలుబొమ్మగా మారారాని తీవ్ర విమర్శలు చేశారు.
‘పవన్ కళ్యాణ్‌కు సిద్ధాంతాలు కానీ.. ఐడీలయాజీ కానీ లేవు. రేపు ఆయన సీఎం పదవికి పోటీ పడ్డా ఆయనకు ఎలాంటి ఐడియాలజీ లేదు. నాకు వైఎస్ కుటుంబంతో మూడు తరాల అనుబంధం ఉంది. అనంతపురం జిల్లాకు ఎయిమ్స్ వస్తే దానిని అమరావతికి తీసుకెళ్లారు. ధర్మవరంలో 80శాతం అభివృద్ధి నేను వచ్చాకే జరిగింది. యువత ముందుకు రాకుంటే దేశంలో తాగుబోతులదే రాజ్యం అవుతోంది. ఈ దరిద్రం ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో..? మద్యం మనలో భాగం అయింది. పవన్ కళ్యాణ్‌తో టచ్‌లోకి కాదు కదా.. అతని సినిమా వకిల్ సాబ్ నేను చూసిన లాస్ట్ మూవీ. ప్రముఖ హీరో కమల్ హాసన్‌ను మించిన నటులు ఎవరూ లేరు. కానీ అతని పరిస్థితి ఎలా ఉంది..? ఫిబ్రవరి 5న ఫీజు రియంబర్స్‌మెంట్ ఆందోళనక్కి అందరూ తరలిరావాలి’ అని కేతిరెడ్డి పిలుపునిచ్చారు.
సినిమా హీరోలు చిరంజీవి, బాలకృష్ణలపై కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ హీరోలకు మాత్రమే భారీగా ఫ్యాన్ ఫాల్లోయింగ్ ఉంటుందని సోషల్ మీడియాలో కొందరు అభిమానులు ఒక్కటే కామెంట్లు, వీడియోలు పోస్ట్ చేస్తారు. అయితే చిరంజీవి, బాలకృష్ణలు సినిమాల్లో మాత్రమే హీరోలని.. ప్రజల్లో మాత్రం కాదని ఆయనన్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో చిరంజీవిలో రెండు చోట్లు ఎమ్మెల్యేగా పోటీచేశారు. కానీ గెలిచింది మాత్ర తిరుపతిలో మాత్రమే అని అన్నారు. సొంత నియోజకవర్గంలో చిరంజీవి ఓడిపోయారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గుర్తు చేశారు.
బాలయ్య, చిరంజీవి ఇద్దరూ సినిమాలో మాత్రమే హీరోలని.. బయట ఏముండదని ఎద్దేవా చేశారు. నిజ జీవితంలో మాజీ సీఎం జగన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాత్రమే హీరోలని చెప్పారు. జగన్ అయిన.. పవన్ అయిన కానీ మీటింగ్ పెడితే పదే పది నిమిషాల్లో వేల మంది జనాలు తరలి వస్తారు. అది వాళ్లపై ఉన్న ప్రేమ. రాష్ట్రంలో ఇద్దరికీ మాత్రమే ఫ్యాన్స్ ఫాల్లోయింగ్ ఉంది. దక్షిణ భారతదేశంలో హీరోని దేవుడిలా మొక్కుతారు. చంద్రబాబు అయితే మేనేజ్ మేంట్ మాత్రమే చేస్తారు. రాష్ట్రంలో రాజకీయం మాత్రమే చాలా దారుణంగా ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు చేతిలో పవన్ కల్యాణ్ కీలుబొమ్మ అయ్యారు. పవన్ కు నిజంగా సొంత సిద్దాంత, భావజాలం ఏమీ లేదు. చంద్రబాబుకు విజన్ ఎక్కడ ఉన్నది..? చరిత్రలో నిలిచిపోయే పథకం ఒక్కటైనా ఉందా..?’ అని కేతిరెడ్డి నీలదీశారు.
Also Read: Budget on Congress: బడ్జెట్ పూర్తిగా ట్రాక్ తప్పింది.. కాంగ్రెస్ తీవ్ర విమర్శలు
వైసీపీికి విజయసాయి రెడ్డి రాజీనామా చేయడంపైనా కూడా కేతిరెడ్డి రియాక్ట్ అయ్యారు. విజయసాయిరెడ్డికి జగన్‌తో ఉంటే వాల్యూ ఉంటుందన్నారు. జగన్ సిద్ధాంతాలు నచ్చాకనే నేను వైసీపీ చేరాను. జగన్ హయాంలో రాష్ట్రంలో గొప్ప పథకాలు అమలయ్యాయి. రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ మాత్రమే మంచి పాలన అందించారు’ అని కేతిరెడ్డి చెప్పారు.