KTR on CM Revanth: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కొడితే ఎలా ఉంటుందో రేవంత్ గురువు రాహుల్, సోనియాగాంధీలకు తెలుససని.. వారిని అడిగితే కేసీఆర్ దెబ్బ ఎలా ఉంటుందో చెబుతారని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ పరిగిలో జరిగన సభలో కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ కర్ర లేకుండా నిలబడతారని.. ముందు రేవంత్ రెడ్డి కమిషన్ లేకుండా పాలన కొనసాగించాలని ఎద్దేవా చేవారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని.. నేను చేసిన సవాల్‌కు రేవంత్ రెడ్డి స్పందించడం లేదని కేటీఆర్ పేర్కొన్నారు.
రేవంత్‌కి దమ్ముంటే లగచర్లకు రావాలి. మీరు రాలేరు.. నేనే కొడంగల్‌కి వస్తా. రేవంత్‌కి దమ్ముంటే పోలీసులతో అడ్డుకోవద్దు. కొడంగల్ వస్తాం, మీ సంగతి ఏంటో చూస్తాం. హామీలిచ్చి మాటతప్పితే నిలదీయాలి. వందశాతం రుణమాఫీ అయినట్టు నిరూపిస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటా. నా సవాల్‌కి రేవంత్ నుంచి ఇంతవరకు స్పందన లేదు. కాంగ్రెస్ ఇచ్చిన రైతుబంధు పైసలు BRS కూడబెట్టినవే. రేవంత్ సర్కార్ ఒక్క రూపాయి రైతుబంధు ఇవ్వలేదు. వానాకాలం రైతుబంధు కూడా రేవంత్ బాకీ పడ్డారు. ఎన్నికలు ఉన్నాయి కాబట్టే రైతుబంధు డ్రామా ఆడుతున్నారు. ఎన్నికలు అయిపోయాక కాంగ్రెస్ వాళ్లు అసలు దొరకరు. ఎకరాకు రూ.17,500 ఇచ్చే వరకు వదిలిపెట్టొద్దు. తులం బంగారం ఏమైందని మహిళలు నిలదీయాలి..?’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Also Read: Kethi Reddy: చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ అసలు హీరోలే కాదు.. కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు