Big Stories

CM Revanth Reddy on Runamafi: రైతు రుణమాఫీ చేసి రుణం తీర్చుకుంటా: రేవంత్ రెడ్డి!

CM Revanth Reddy on Runamafi in Road Show at Kothakota: రైతు రుణమాఫీ చేసి తెలంగాణ ప్రజల రుణం తీర్చుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొత్తకోట రోడ్ షోలో పాల్గొన్న సీఎం ప్రసంగించారు. తాను వారసత్వంతో రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. 70 ఏండ్ల తరువాత పాలమూరు బిడ్డ సీఎం అయ్యాడని తెలిపారు. గత ఎన్నికల్లో పాలమూరులో 14 సీట్లకు 12 సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకుందని గుర్తు చేశారు.

- Advertisement -

రాజకీయాలు పక్కన పెట్టి పాలమూరు అభివృద్ధి కోసం కలసి రావాలని డీకే అరుణను కోరానన్నారు. డీకే అరుణకు కాంగ్రెస్ ఏమీ చేయలేదా అన్ని ప్రశ్నించారు. రిజర్వేషన్ల కోసం కోట్లాడుతుంటే బీజేపీ నేతలు తనపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలకు డీకే అరుణ వత్తాసు పలుకుతుందని మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలని అన్నారు.

- Advertisement -

మోదీ, అమిత్ షాలతో కలిసి డీకే అరుణ తనపై కుట్రలు చేస్తోందని ఆరోపించారు. బీజేపీ..రిజర్వేషన్లు రద్దు చేస్తుందని అన్నందుకు తనపై ఢిల్లీలో కేసుల పెట్టారని మండిపడ్డారు. తనను అరెస్ట్ చేయడానికి ఢిల్లీ పోలీసులను హైదరాబాద్ కు పంపించారని అన్నారు. డీకే అరుణ మహబూబ్ నగర్ ప్రజల కోసం ఏమీ చేయలేదని ఆరోపించారు.డీకే అరుణతో తనకు ఎలాంటి కక్షలు లేవని స్పష్టం చేశారు.

Also Read: కేసీఆర్‌కు మరో షాక్.. స్పీడ్ పోస్ట్ ద్వారా తెలంగాణ భవన్‌కు..

మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని అన్నారు. నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ లో లక్ష మెజారిటీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వనపర్తిలో పార్టీ గెలుపు కోసం గల్లీ గల్లీ తిరిగానని తెలిపారు. పాలమూరు బిడ్డకు సోనియా గాంధీ అత్యున్నత పదవి ఇచ్చారని అన్నారు. కానీ పదవి నుంచి తనను దించుతామంటూ కొందరు పిచ్చి కూతలు కూస్తున్నారని ఆరోపించారు. కురుమూర్తి స్వామి సాక్షిగా ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పారు. రుణమాఫీ చేసి ప్రజల రుణం తీర్చుకోకపోతే సీఎం పదవి వృథా అని అన్నారు. మే 9న ప్రతీ రైతుకు రైతు భరోసా ఇస్తానని హామీ ఇచ్చారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News