EPAPER

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Shocking Study: కరోనా వైరస్ సృష్టించిన కల్లోలాన్ని ఎవరూ మర్చిపోలేరు. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ లాంటి మొండి బ్యాక్టీరియాలు, వైరస్‌లు మరిన్ని పుట్టుకొచ్చే అవకాశం ఉన్నట్టు అధ్యయనం చెబుతోంది. అవి వ్యాధినిరోధకతను పొందిన సూపర్ బగ్స్ గా మారుతాయి. వాటి వల్ల 2050 నాటికి 40 మిలియన్ల మందిని చంపేస్తాయని కూడా కొత్త అధ్యయనం చెబుతోంది.


యాంటిబయోటిక్స్‌కు లొంగని సూపర్ బగ్స్

ఈ సూపర్ బగ్స్… యాంటీబయోటిక్ లకు లొంగవని, తీవ్రమైన యాంటీబయోటిక్ నిరోధకతను కలిగి ఉంటాయని అధ్యయనం వివరిస్తోంది. ఈ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడం కూడా కష్టతరంగా మారుతుందని చెబుతోంది. ఇది ప్రపంచ ఆరోగ్యానికి ముప్పుగా గుర్తించాల్సి వస్తుందని కూడా వివరిస్తోంది.


లక్షల్లో మరణాలు..

యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ అంటే యాంటీబయోటిక్స్ మందులకు కూడా లొంగని బ్యాక్టీరియా, వైరస్‌లు అని అర్థం. 1990 నుంచి పోలిస్తే 2021 కల్లా ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షల మంది ఇలాంటి మొంటి బ్యాక్టీరియా, వైరస్‌ల వల్లే మరణిస్తున్నట్టు ఒక పరిశోధన వివరించింది. ముఖ్యంగా శిశువులకు అంటువ్యాధులు సోకి వాటిని నియంత్రించలేక ఎంతోమంది ఐదేళ్ల లోపే మరణించినట్టు తెలుస్తోంది. అలాంటి మందులకు లొంగని ఇన్ఫెక్షన్లు మరిన్ని వస్తాయన్నది ఈ కొత్త అధ్యయనం ఫలితం వివరిస్తోంది.

2050 నాటికి 4 కోట్ల మరణాలు

వైరస్ లేదా బ్యాక్టీరియాల వల్ల శరీరానికి ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు అది ప్రాణాంతకంగా మారుతుంది. దానికి ఎలాంటి చికిత్సలు చేసినా కూడా అది తగ్గుముఖం పట్టకపోవచ్చు. యాంటీబయోటిక్స్ మందులను తట్టుకునే శక్తిని అవి పొందుతాయి. దీనివల్ల చివరికి ప్రాణాలు కోల్పోవాల్సి రావచ్చు. ఇలాంటి మరణాలు కాలక్రమంగా పెరుగుతూనే ఉంటాయన్నది కొత్త అధ్యయనం చెబుతున్న విషయం. 2050 నాటికల్లా ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది కేవలం ఇలాంటి అంతుచిక్కని వైరస్, బ్యాక్టీరియా ల వల్లే మరణించే అవకాశం ఉంటుంది.

ఎక్కువగా వాళ్లే..

1990 నుండి 2021 వరకు చూస్తే 70 ఏళ్ళు అంతకంటే వయసు దాటినవారికి ఇలాంటి అంతుచిక్కని వైరస్‌లు సోకి 80 శాతానికి పైగా మరణించినట్టు అధ్యయనం కనుగొంది. ఇది ఇలాగే రెట్టింపు వేగంతో కొనసాగే అవకాశం కూడా ఉంటుందని అంచనా వేస్తోంది.

Also Read: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

ఇలా చేస్తేనే.. సేఫ్

కొత్త వైరస్‌లు, బ్యాక్టీరియాలు పుట్టుకొచ్చినట్టే.. కొత్త యాంటీబయోటిక్‌లను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న యాంటీబయోటిక్‌లను తట్టుకునే శక్తి బ్యాక్టీరియా, వైరస్లు తెచ్చుకుంటున్నాయి. అలాగే కొత్త బ్యాక్టీరియా, వైరస్‌లను కూడా శక్తివంతంగా అదుపు చేయగల ఔషధాలను కనిపెడితేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. లేకుంటే ఏటా లక్షల మంది ఇన్ఫెక్షన్ల కారణంగా మరణించే అవకాశం పెరుగుతుంది.

Related News

Porphyria: వెల్లుల్లి తింటే ప్రాణాలు పోతాయట, అమెరికన్ లేడీకి వింత రోగం!

Children Eye Problems: వామ్మో సెల్ ఫోన్, పిల్లలకు అస్సలు ఇవ్వకండి, లేదంటే ఈ ముప్పు తప్పదు!

Roadside Book Stores: రోడ్లపై పుస్తకాలు అమ్మితే.. ఏం వస్తుంది…?

Murine Typhus: అమ్మో దోమ.. కేరళలో కొత్త రోగం, ఈ అరుదైన వ్యాధి సోకితే ఏమవుతుందో తెలుసా?

Coffee Benefits: మిరాకిల్.. రెండు కప్పుల కాఫీతో ఇన్ని బెనిఫిట్సా? మీరు నమ్మలేరు!

Mirchi: మిరపకాయలకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..? అందుకు మిరియాలే కారణమంటా..

Tips For Pregnant Women: గర్భిణీలు ఈ పోషకాహారం తింటే తల్లీ, బిడ్డా ఆరోగ్యంగా ఉంటారు

Big Stories

×