Indian Railways Lower Berth: భారతీయ రైల్వేలో నిత్యం లక్షల మంది ప్రయాణిస్తుంటారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం రైల్వే శాఖ తగిన నిర్ణయాలు తీసుకుంటుంది. సీనియర్ సిటిజన్లు, మహిళలు, దివ్యాంగులకు లోయర్ బెర్తుల కేటాయింపులో కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ సిటిజన్లు, మహిళలు, దివ్యాంగులు అప్పర్, మిడిల్ బెర్తుల ఇబ్బందులను తగ్గించేందుకు లోయర్ బెర్తుల కేటాయింపు పెంచింది.
రైల్వే టికెట్ రిజర్వేషన్ సమయంలో బెర్తులను ఎంచుకునే ఆప్షన్ ఉంటుంది. సాధారణంగా లోయర్ బెర్తు కోసం ఎక్కువ మంది ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, మహిళలు, దివ్యాంగులు లోయర్ బెర్తులు ఎంచుకుంటారు. అయితే ఎక్కువ డిమాండ్ నేపథ్యంలో అందరికీ ఈ బెర్తులు దొరకవు. దీంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
రైల్వే రిజర్వేషన్ లో ఆటోమేటిక్ బెర్తు కేటాయింపు ప్రక్రియను అమల్లోకి తీసుకొచ్చింది. గర్భిణీలు, 45 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉండే మహిళలు, వృద్ధులు(60 ఏళ్లు పైబడిన పురుషులు, 58 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు) టికెట్ బుకింగ్ సమయంలో లోయర్ బెర్తు ఎంపిక చేసుకోకపోయినా ఆటోమేటిక్ గా లోయర్ బెర్తులను కేటాయించనున్నారు.
లోయర్ బెర్తు రిజర్వేషన్ కోటాలో రైల్వే శాఖ మార్పులు చేసింది. ఈ కేటాయింపు కోచ్ లను మారుతుంది.
రిజర్వ్ చేసిన లోయర్ బెర్తుల సంఖ్య రైలులోని మొత్తం కోచ్‌ల సంఖ్యపై ఆధారపడి ఉంటుందని రైల్వే శాఖ తెలిపింది.
Also Read: Diwali Special Trains: దీపావళి వేళ అదిరిపోయే న్యూస్, అందుబాటులోకి 30 లక్షల బెర్తులు!
భారతీయ రైల్వే ప్రయాణికులకు సబ్సిడీలు అందిస్తుంది. 2022–2023 ఆర్థిక సంవత్సరంలో రూ.56,993 కోట్ల సబ్సిడీని ప్రయాణికులకు అందించింది. అంటే ప్రతి ప్రయాణికుడికి సగటున 46% సబ్సిడీ లభించింది.