Kaleshwaram Project Corruption: కాలేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన అవినీతి ఇంజనీర్ల ఆస్తులు జప్తు చేస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఏసీబీకి పట్టుబడ్డ ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ ఆస్తులను జప్తు చేయాలంటూ విజిలెన్స్ లేఖ రాసింది. ఏసీబీ దర్యాప్తులో గుర్తించిన ఇంజనీర్ల ఆస్తులన్నీ నిషేధిత జాబితాలో పెట్టింది ప్రభుత్వం. కాలేశ్వరం ప్రాజెక్టులో పని చేస్తున్న ఇంజనీర్ నూనె శ్రీధర్, ENC హరి రామ్, మాజీ ENC మురళీధర్ రావు ను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గతంలోనే అరెస్ట్ చేసింది ఏసీబీ.
ఇంజనీర్ నూనె శ్రీధర్కు చెందిన సుమారు ₹110 కోట్ల విలువైన ఆస్తులు, హరి రామ్ కు చెందిన ₹90 కోట్ల ఆస్తులు, మురళీధర్ రావుకు చెందిన ₹100 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఏసీబీ దర్యాప్తు ప్రకారం, కాలేశ్వరం ప్రాజెక్టు పనుల్లో 40 వేల కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టులు హరి రామ్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ పనుల బిల్లులు విడుదల చేసే సమయంలో శాతాల వారీగా లంచాలు తీసుకున్నట్లు గుర్తించారు. కాంట్రాక్టర్ల నుండి కోట్ల రూపాయలు వసూలు చేసి, వీటిని కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లపై పెట్టుబడులుగా మార్చినట్టు ఆధారాలు లభించాయి.
విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా ఏసీబీకి అధికారిక లేఖ పంపింది. అందులఅవినీతి నిర్ధారణైన ఇంజనీర్ల ఆస్తులను వెంటనే ప్రభుత్వ ఖాతాలో నమోదు చేయాలని సూచించింది. అలాగే వీరి ఆస్తులపై ఎవరికైనా హక్కులు ఇవ్వకూడదని, కేసులు తేలేవరకు స్థిరాస్తులను సీజ్‌లో ఉంచాలని ఆదేశించింది.
ఏసీబీ ప్రస్తుతం ప్రాజెక్టులో పనిచేసిన ఇంకా 8 మంది ఇంజనీర్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లపై దర్యాప్తు జరుపుతోంది. త్వరలో మరికొంతమంది అధికారుల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు టెండర్ల దశ నుండి బిల్లుల విడుదల వరకు జరిగిన ప్రతి లావాదేవీపై సుదీర్ఘ విచారణ కొనసాగుతోంది.
Also Read: 5 ఏళ్లలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు.. విశాఖలో అడుగుపెడుతున్న గూగుల్.. కీలక ఒప్పందం!
వీరిపై నమోదైన కేసులు తేలేదాకా కొనుగోలు, అమ్మకాలు జరపకుండా నిషేధిత జాబితాలో ఆస్తులు ఉంచింది. విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా సోదాలు నిర్వహించిన ఏసీబీ.. ఇప్పుడు మరికొంత మంది ఇంజినీర్లపైనా ఫోకస్ చేసింది.