iQoo Z9 Turbo plus: చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివో సబ్ బ్రాండ్ iQoo ఇతర బ్రాండ్‌లకు గట్టి పోటీ ఇస్తుంది. తన లైనప్‌లో ఉన్న కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ దూసుకుపోతుంది. ఇప్పటికే తన లైనప్‌లో ఉన్న ఎన్నో మోడళ్లను లాంచ్ చేసి గుర్తింపు అందుకుంది. ఇక ఇప్పుడు మరో ఫోన్‌ను పరిచయం చేసేందుకు సిద్ధమైంది. తన తదుపరి ఫోన్ iQoo Z9 Turbo+ను వచ్చే వారం లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే తాజాగా కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్‌ల గురించి సమాచారాన్ని అందించింది. ఇందులో MediaTek డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్‌గా ఇవ్వబడుతుందని చెప్పబడింది.
అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో అతి పెద్ద 6400 mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలిపింది. Z9 Turbo+ స్మార్ట్‌ఫోన్ ఈ నెల అంటే సెప్టెంబర్ 24న చైనాలో లాంచ్ అవుతుందని చైనా మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ Weiboలో షేర్ చేసిన పోస్టర్‌లో iQoo వెల్లడించింది. ఇది కర్వ్డ్ డిస్‌ప్లే, హోల్ పంచ్ కటౌట్‌ను కలిగి ఉంది. దాని వెనుక భాగంలో రెక్టాగ్యులర్ కెమెరా మాడ్యూల్ అందించబడింది.
Also Read: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!
ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇది 6.7 అంగుళాల డిస్‌ప్లేతో 1.5K రిజల్యూషన్‌కు మద్దతు ఇస్తుంది. ముఖ్యంగా గేమింగ్ ఆడేవారికి ఇది బెస్ట్‌గా చెప్పుకోవచ్చు. గేమింగ్‌పై దృష్టి సారించే Z9 Turbo+, ఓపెన్ వరల్డ్ మొబైల్ గేమ్‌లను ఆడుతున్నప్పుడు గరిష్టంగా 72 fps (సెకనుకు ఫ్రేమ్‌లు) పొందుతుంది. అలాగే ఈ ఫోన్‌లో అతి పెద్ద 6400 mAh బ్యాటరీ అందించబడుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం 6K VC లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది.
ఆసక్తిగల కస్టమర్ల కోసం Z9 Turbo+ ముందస్తు ఆర్డర్‌లు ప్రారంభమయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరా స్పెసిఫికేషన్‌ల గురించి సమాచారం ఇవ్వబడలేదు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం.. ఇది 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉండవచ్చని గతంలో కొన్ని లీక్‌లలో చెప్పబడింది. ఇది కాకుండా 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌ను అంఫదించవచ్చు.
అలాగే దీని ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండవచ్చని చెప్పబడింది. ఇదిలా ఉంటే గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ప్రస్తుత సంవత్సరం ప్రథమార్థంలో దేశంలో 5జీ స్మార్ట్‌ఫోన్ల షిప్‌మెంట్లు 60 శాతం పెరిగాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ల అంతర్జాతీయ షిప్‌మెంట్‌లలో 25 శాతం కంటే ఎక్కువ వాటాతో ఆపిల్ మొదటి స్థానంలో ఉంది.