BigTV English
Advertisement

Rajinikanth : లైఫ్ ఇచ్చిన నిర్మాతను ఆదుకున్న రజనీకాంత్… ఏకంగా కోటి రూపాయలు పెట్టి..

Rajinikanth : లైఫ్ ఇచ్చిన నిర్మాతను ఆదుకున్న రజనీకాంత్… ఏకంగా కోటి రూపాయలు పెట్టి..

Rajinikanth :సాధారణంగా ఎక్కడైనా సరే పొందిన సహాయాన్ని మరిచిపోకూడదు అని చెబుతూ ఉంటారు. అందుకే చాలామంది తమకు సహాయం చేసిన వారిని గుర్తుపెట్టుకుని మరి వారికి తిరిగి సహాయం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో రజనీకాంత్(Rajinkanth ) ఇప్పుడు ప్రథమ స్థానంలో నిలిచారు. అప్పుడెప్పుడో తనకు జీవితాన్ని ప్రసాదించిన ఒక వ్యక్తిని గుర్తు పెట్టుకొని మరీ ఇప్పుడు ఆయనకు సహాయం చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇది విన్న నెటిజన్స్.. ఇలా ఆలోచించే వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టే సమాజం ఇంకా మంచి మార్గంలో వెళ్తోంది అంటూ ఈ విషయం తెలిసిన కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


నిర్మాతకు భారీ సహాయం చేసిన సూపర్ స్టార్..

టాలీవుడ్ , కోలీవుడ్ అంటూ సంబంధం లేకుండా సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు రజినీకాంత్. ముఖ్యంగా ఎవరికైనా కష్టం వస్తే ఆదుకోవడానికి ముందుండే ఈయన ఇప్పుడు మరొకసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన తొలి చిత్రం భైరవి. 1978లో విడుదలైందిఈ చిత్రానికి నిర్మాతగా కలైజ్ఞానం (Kalaignanan ) వ్యవహరించారు. అయితే ఇప్పుడు ఆయన అద్దె ఇంట్లో ఉంటున్నారని తెలుసుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్.. స్వయంగా ఆయనకు కోటి రూపాయల విలువైన ఇంటిని బహుమతిగా అందించారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. తనకు జీవితాన్ని ప్రసాదించిన నిర్మాత ఇప్పుడు అద్దె ఇంట్లో ఉంటున్నారని తెలుసుకొని మరీ సహాయం చేయడం పై రజినీకాంత్ పై ప్రశంసల కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

also read:Bigg Boss 9 Promo: తనూజ వర్సెస్ ఆయేషా.. ఇది కదా అసలు వార్!


రజనీకాంత్ తొలి చిత్రం భైరవి విశేషాలు..

రజనీకాంత్ నటించిన తొలి చిత్రం భైరవి సినిమా విషయానికి వస్తే.. 1978లో తమిళ భాష చిత్రంగా విడుదలైంది. ఎం భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని.. కలైజ్ఞానం నిర్మించారు. అంతేకాదు ఈయన కథ సంభాషణలు కూడా అందించారు. ఈ చిత్రం ద్వారా గీత పరిచయమై టైటిల్ క్యారెక్టర్ లో నటించింది. శ్రీకాంత్ విలన్ పాత్ర పోషించారు. సుధీర్, మనోరమ, సురుళి రాజన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. 1978 జూన్ 8న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది.

రజనీకాంత్ సినిమాలు..

టాలీవుడ్ కోలీవుడ్ అనే తేడా లేకుండా ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్న రజినీకాంత్.. ఏడుపదుల వయసు దాటినా కూడా వరుస యాక్షన్ చిత్రాలలో నటిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ముఖ్యంగా ప్రతి జానర్ ని టచ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈయన.. ఇప్పుడు జైలర్ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కంటే ముందు లోకేష్ కనగరాజు దర్శకత్వంలో కూలీ సినిమా చేసి పర్వాలేదు అనిపించుకున్న రజినీకాంత్.. ఇప్పుడు జైలర్ 2 తో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఈ సినిమాతో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అందుకోవాలని సూపర్ స్టార్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన జైలర్ సినిమా బ్లాక్ మాస్టర్ కావడంతో దానికి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా మరింత సక్సెస్ అవ్వాలని అటు అభిమానులు నెటిజన్స్ కోరుకుంటున్నారు.

Related News

Siddu Jonnalagadda : చేతిలో మైక్ ఉంటే… ఊమనైజర్ కామెంట్స్‌పై హీరో సిద్దు ఘాటు కౌంటర్

Mithra Mandali: మిత్రమండలి పై లిటిల్ హార్ట్స్ ఫార్ములా .. వర్కౌట్ అయ్యేనా?

Meesala Pilla : మీసాల పిల్ల పాట వచ్చేసింది, మెగా ఫ్యాన్స్ కి కావాల్సిందే ఇదే

Ram Pothineni : రామ్ పోతినేనికి యాటిట్యూడ్.. లవ్ స్టోరీపై రామ్ రియాక్షన్

Sreeleela New Look : హాట్ హాట్ ‘మిర్చి’ ఏజెంట్… శ్రీలీల కొత్త లుక్ చూశారా ?

Kantara Chapter 1 : బాహుబలి రికార్డును చిత్తు చేసిన రిషబ్ శెట్టి… సాహోరే అనాల్సిందేనా ?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోసం పడిగాపులు కాస్తున్న మరో డిజాస్టర్ డైరెక్టర్… అదే జరిగితే..

Big Stories

×